మన్మోహన్‌ కన్నా మోదీయే బెటర్...కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు

ఆమె కామెంట్స్‌ని తమకు అనుకూలంగా మల్చుకుంటున్నారు బీజేపీ నేతలు. పాకిస్తాన్‌కు ధీటుగా జవాబిచ్చే ధైర్యం ఒక్క మోదీకే ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం షీలా వ్యాఖ్యలను జీర్ణించులేకపోతున్నారు.

news18-telugu
Updated: March 14, 2019, 6:39 PM IST
మన్మోహన్‌ కన్నా మోదీయే బెటర్...కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు
మన్మోహన్, మోదీ
news18-telugu
Updated: March 14, 2019, 6:39 PM IST
అసలే ఇది ఎన్నికల సమయం..! పరస్పర విమర్శలు, ఆరోపణలతో కత్తులు దూసుకుంటున్నాయి పార్టీలు. ప్రత్యర్థి పార్టీలను ఎండగడుతూ ప్రజాక్షేత్రంలో ప్రచారం చేస్తున్నాయి.. ఈ తరుణంలో ప్రత్యర్థి పార్టీకి లాభం చేకూర్చేలా మాట్లాడితే..అది తమకే నష్టం. ఇప్పుడు అలాంటి పనే చేశారు ఢిల్లీ మాజీ సీీఎం. కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ధీటుగా ఎదర్కొనే విషయంలో మన్మోహన్ కంటే ప్రధాని మోదీయే బటర్ అని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్న షీలా.. ప్రత్యర్థి పార్టీకి చెంది మోదీపై అనుకూల వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం రేపింది.

CNN-News18 ఇంటర్వ్యూలో మాట్లాడిన షీలా దీక్షిత్ దేశ భద్రతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియా ఎప్పుడూ సురక్షితంగానే ఉందని స్పష్టంచేశారు. ఐతే 26/11 ముంబై దాడుల సందర్భంగా ఉగ్రవాద నిర్మూలనకు యూపీఏ సరైన చర్యలు చేపట్టలేని బీజేపీ విమర్శిస్తోంది. వారి ఆరోపణలపై ఇంటర్వ్యూలో స్పందించిన షీలా..ప్రధాని మోదీతో పోలిస్తే నాటి ప్రధాని మన్మోహన్ సింగ్..ఉగ్రవాదాన్ని బలంగా ఎదుర్కోలేకపోయారని ఆమె వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ ఉగ్రవాద నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారని పరోక్షంగా అంగీకరించారు.

Sheila Dikshit, Sheila Dikshit praises modi, manmohan singh, narendra modi, terrorism,bjp,congress,loksabha elections 2019, షీలా దీక్షిత్, మోదీపై షీలా ప్రశంసలు,నరేంద్ర మోదీ, మన్మోహన్ సింగ్,
షీలా దీక్షిత్


ఐతే రాజకీయ లబ్ధి కోసమే పాకిస్తాన్ పట్ల మోదీ దూకుడుగా వ్యహరిస్తున్నారని షీలా దీక్షిత్ స్పష్టంచేశారు. బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణా కేంద్రంపై వైమానికదాడులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు షీలా దీక్షిత్.
ఉగ్రవాదాన్ని మన్మోహన్ కంటే మోదీయే ధీటుగా ఎదుర్కొన్నారన్న ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఆమె కామెంట్స్‌ని తమకు అనుకూలంగా మల్చుకుంటున్నారు బీజేపీ నేతలు. పాకిస్తాన్‌కు ధీటుగా జవాబిచ్చే ధైర్యం ఒక్క మోదీకే ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం షీలా వ్యాఖ్యలను జీర్ణించులేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడారని అభ్యంతరం వ్యక్తంచేశారు. దాంతో ఆత్మరక్షణలో పడ్డారు షీలా దీక్షిత్. తాను మాట్లాడిన సందర్భాన్ని వేరేలా అనుకుంటే.. తానేమీ చేయలేనని స్పష్టంచేశారు.
First published: March 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...