ఢిల్లీ లిక్కర్ స్కామ్(delhi liquor scam) కేసులో మనీష్ సిసోడియా(manish sisodia)కు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈనెల 20 వరకు ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉండనున్నారు. ఆయన్ను తీహార్(tihar) జైలుకు తరలించారు. ఇప్పటికే వారం రోజుల పాటు సిసోడియాను సీబీఐ అధికారులు ప్రశ్నించించారు. ప్రస్తుతం ఢిల్లీలో పలు ప్రాంతాల్లో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ముఖ్యంగా సిసోడియాను తీహార్ జైలుకు తరలించే ప్రాంతాల్లో బలగాలు పెద్ద సంఖ్యలో మోహరించాయి. ఇటు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు వద్ద కూడా భద్రతను పెంచారు. మరోవైపు.. ఆప్ నేతలు అరెస్ట్‌లపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీలో పెద్ద ఎత్తు ఆందోళనలు, నిరసనలకు దిగారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఆప్‌కు పోటీగా బీజీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక సిసోడియా బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 10న విచారణ జరగనుంది.
ప్రధాని మోదీకి తొమ్మిది విపక్ష పార్టీల లేఖ:
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్ బీజేపీ వ్యతిరేక పార్టీలన్ని మరోసారి ఏకమయ్యాయి. ప్రజా తీర్పును గౌరవించాలంటూ ప్రధాని మోదీకి తొమ్మిది విపక్ష పార్టీల నేతలు లేఖ రాశారు. ఈ లేఖ రాసిన వారిలో నలుగురు సీఎంలు కేసీఆర్ ,మమతా బెనర్జీ,భగవంత్ మాన్, కేజ్రీవాల్ తో పాటు తేజస్వీ యాదవ్, ఫరూఖ్ అబ్దుల్లా, షరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్ ఉన్నారు. సిసోడియాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని.. రాజకీయ కుట్రతో కూడుకున్నవని పేర్కొన్నారు. దర్యాప్తు సంస్తలను కేంద్రం దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. సెంట్రల్ ఏజెన్సీలను ప్రతిపక్షాలపై ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. అంతేకాదు.. విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయడం, బీజేపీలో చేరగానే ఆ కేసులను నీరుగార్చడం జరుగుతోందని ఆరోపించారు.
ఇక సిసోడియా రాజకీయ కథ ముగిసినట్లేనా?
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అక్రమాలు జరిగాయని వెల్లువెత్తిన ఆరోపణలపై ఢి మనీశ్ సిసోడియాతో పాటు పలువురు అధికారులు, ప్రైవేటు వ్యక్తులపై గత ఆగస్టు 19న సీబీఐ కేసు నమోదు చేసింది. లిక్కర్ కుంభకోణంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లోతుగా దర్యాప్తు చేసింది. ఢిల్లీ ప్రభుత్వానికి నష్టం కలిగే విధంగా.. హోల్‌సేల్ లిక్కర్ బిజినెస్ జోన్లవారీగా చేజిక్కించుకోడానికి ప్రభుత్వ పెద్దలకు ముడుపులు చెల్లించారనేది అభియోగం. ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న లిక్కర్ పాలసీ అక్రమసంపాదనకు ఊతమిచ్చిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో ఎనిమిది రోజుల క్రితం సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఆయన తన మంత్రి పదవులకు రాజీనామా చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CBI, Delhi liquor Scam