పతనం అంచున బీజేపీ ప్రభుత్వం... కాంగ్రెస్‌లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలు...

మణిపూర్‌లో ఎన్. బీరెన్ సింగ్ సారధ్యంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం పతనం అంచున నిలిచింది.

news18-telugu
Updated: June 17, 2020, 10:35 PM IST
పతనం అంచున బీజేపీ ప్రభుత్వం... కాంగ్రెస్‌లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలు...
కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎన్‌పీపీ, బీజేపీ, టీఎంసీ ఎమ్మెల్యేలు
  • Share this:
మణిపూర్‌లో ఎన్. బీరెన్ సింగ్ సారధ్యంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం పతనం అంచున నిలిచింది. బీజేపీ, టీఎంసీ, ఎన్‌పీపీలకు చెందిన మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు బీరెన్ సింగ్ ప్రభుత్వం మీద అసమ్మతి ప్రకటించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్పీపీకి చెందిన నలుగు, బీజేపీకి చెందిన ముగ్గురు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒకరు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాజీనామా చేసిన వారిలో డిప్యూటీ సీఎం జైకుమార్ సింగ్ కూడా ఉన్నారు. గిరిజన శాఖ మంత్రి కయిషి, క్రీడా శాఖ మంత్రి లెట్ పావ్ హాకిప్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జయంతకుమార్ సింగ్ కూడా రాజీనామా చేసి హస్తం కండువా కప్పుకొన్నారు. ఇక బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సుభాష్ చంద్ర, టీటీ హాకిప్, శామ్యూల్ జెందాయ్ కూడా కాషాయ కండువాను తీసి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. దీంతో బీజేపీ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 మంది సంఖ్యా బలం కాగా, బీజేపీ బలం 18కి పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్నిపొందింది.
First published: June 17, 2020, 10:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading