మణిపూర్ (Manipur)లో ఉగ్రవాదులు (Terrorists) పేట్రేగిపోయారు. 46 అసోం రైఫిల్స్ జవాన్లు వెళ్తున్న కాన్వాయ్‌పై మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో కమాండింగ్ ఆఫీసర్, ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలువురు జవాన్లు మరణించారు. చూరచాంద్‌పూర్ జిల్లా బెహియాంగ్ పరిధిలోని సెకెన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. కమాండింగ్ ఆఫీసర్ విప్లవ్ త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడితో పాటు క్విక్ రియాక్షన్ టీమ్ వాహనాల్లో వెళ్తుండగా ఉగ్రవాదులు దాడి చేశారు. జవాన్లు తేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విప్లవ్ త్రిపాఠితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, నలుగురు జవాన్లు స్పాట్లోనే మరణించినట్లు తెలిసింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
Convoy of a Commanding Officer of an Assam Rifles unit ambushed by terrorists in Singhat sub-division of Manipur’s Churachandpur district. Family members of officer along with Quick Reaction Team were in convoy. Casualties feared. Ops underway, details awaited: Sources
సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడ్డ జవాన్లను హుటాహుటిన ఆస్పత్రికి తరలించాయి. సెకెన్ గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. జవాన్లపై దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఐతే ఈ దాడికి ఎవరు పాల్పడ్డారన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఇప్పటి వరకు ప్రకటన విడుదల చేయలేదు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.