MANIPUR ELECTIONS 2022 VOTING UPDATES ABOVE 78PC VOTER TURNOUT TILL 5 PM COP ON POLL DUTY KILLED IN ACCIDENTAL FIRING MKS
Manipur Polls: మణిపూర్ తొలిదశలో భారీ పోలింగ్.. సా.5వరకే 78 శాతానికిపైగా.. పోలీస్ దుర్మరణం
మణిపూర్ పోలింగ్
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో భారీ పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల సమయానికే 70.03శాతం పోలింగ్ రికార్డయింది. తుది లెక్కలు రేపటికి వెల్లడవుతాయి. చురచంద్‌పూర్ లో తుపాకి మిస్ ఫైర్ అయి ఓ పోలీస్ చనిపోయాడు. వివరాలివే..
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో భారీ పోలింగ్ నమోదైంది. మొత్తం 60 స్థానాలు ఉండగా, తొలి దశలో ఐదు జిల్లాల పరిధిలోని 38 నియోజకవర్గాలకు సోమవారం ఓటింగ్ జరగ్గా, సాయంత్రం 5 గంటల సమయానికే 70.03శాతం పోలింగ్ రికార్డయింది. చాలా చోట్ల క్యూలైన్లలో జనం కనిపించారు. సాయంత్రం 6 వరకూ ఓటేసే అవకాశం కల్పించారు. దీంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశముంది. తుది ఓటింగ్ శాతం రేపు వెల్లడికానుంది. గత(2017) ఎన్నికల్లో మణిపూర్ లో 86 శాతం పోలింగ్ నమోదైంది.
మణిపూర్ ఎన్నికల తొలి దశ పోలింగ్ లో పలు చోట్ల హింస చోటుచేసుకుంది. అయినాసరే, ఆ ప్రభావం ఓటింగ్ పై పడలేదు. కాంగ్పోకిలో ఇప్పటివరకు అత్యధికంగా 82.97 శాతం, ఇంఫాల్ వెస్ట్‌లో 82.19 శాతం, ఇంఫాల్ ఈస్ట్‌లో 76.64 శాతం పోలింగ్ నమోదైంది. కీరావ్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ వర్గాలు రాళ్ల దాడికి దిగడంతో పోలీసులు కాల్పులు జరిపారు. కాంగ్పోక్పి జిల్లాలోని న్యూ కెయిథెల్‌మన్బి నియోజకవర్గం, చురాచంద్‌పూర్‌లోని సింఘత్ అసెంబ్లీ నియోజకవర్గంలో హింస చెలరేగింది.సింఘత్ లో ఈవీఎం కంట్రోల్ యూనిట్ పాడైంది. రిటర్నింగ్ అధికారి బ్యాకప్ ఈవీఎం కోసం కాల్ చేశారు. న్యూ కెయిథెల్మన్బిలోనూ బీజేపీ కార్యకర్తలు బూత్‌ను స్వాధీనం చేసుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. కాగా,
మణిపూర్ తోలి దశ పోలింగ్ లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పోలింగ్ విధులు నిర్వహిస్తోన్న ఓ పోలీసు.. సర్వీస్ రివాల్వర్ మిస్ ఫైర్ కావడంతో తూటాకు బలయ్యాడు. చురచంద్‌పూర్ జిల్లాలోని తిపైముఖ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఘటన చోటుచేసుకుందని, చనిపోయిన పోలీసును కక్చింగ్ జిల్లాకు చెందిన నౌరెమ్ ఇబోచౌబాగా గుర్తించామని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) రాజేష్ అగర్వాల్ తెలిపారు.
మణిపూర్ లో మరోసారి బీజేపీనే ప్రజలు ఆశీర్వదిస్తారని సీఎం బీరేన్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఈసారి బీజేపీకి 30 నుంచి 38 సీట్లు లభిస్తాయన్నారు. రాష్ట్రంలో మిగిలిన 22 అసెంబ్లీ స్థానాలకు మార్చి 5న రెండో విడుత పోలింగ్ జరుగనుంది. అదేనెల 10న ఫలితాలు వెలువడనున్నాయి.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.