Home /News /national /

MANIPUR ELECTIONS 2022 PHASE TWO VOTING UPDATES TWO KILLED IN POLL VIOLENCE ABOVE 76PC VOTING TILL 5PM MKS

Manipur Poll Violence: మణిపూర్ రెండో దశ ఎన్నికల్లోనూ హింస.. ఇద్దరు మృతి

మణిపూర్ ఎన్నికల హింస (photo credit : northeastlive)

మణిపూర్ ఎన్నికల హింస (photo credit : northeastlive)

మణిపూర్ రెండో దశ పోలింగ్‌లో భాగంగా శనివారంనాడు తౌబల్‌ జిల్లాలో ఒక ఘటన, సెనాపతి జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు మృతి చెందారు.

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో (Manipur Assembly Election 2022) చివరిదైన రెండో దశ పోలింగ్ లోనూ హింస ప్రజ్వరిల్లింది. గత నెల 24న జరిగిన తొలి దశ పోలింగ్ లోనూ హింస చెలరేగడం (Manipur Poll Violence), మిస్ ఫైర్ వల్ల ఓ పోలీస్ చనిపోవడం తెలిసిందే. రెండో దశ పోలింగ్‌లో భాగంగా శనివారంనాడు తౌబల్‌ జిల్లాలో ఒక ఘటన, సెనాపతి జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు మృతి చెందారు.

తోబుమై పోలింగ్ స్టేషన్‌లో నాగా పీపుల్స్ ఫ్రంట్, స్వతంత్ర అభ్యర్థి మద్దతుదారులు ఘర్షణ పడ్డారు. జీపును కింద పడేశారు. మరో చోట మీడియా బృందాలపై దుండగులు దాడి చేశారు. అయితే, పోలీసులు సకాలంలో స్పందించడంతో ముప్పు తప్పినట్లయింది. తోబుమై గ్రామానికి ఓటర్లను తరలిస్తోన్న బస్సుపైనా దాడి జరిగిందని, పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది.

Viral Video: తాతా ది గ్రేట్ -102 వయసులో 100మీ రికార్డు బద్దలు- Sawang Janpram స్టైలే వేరు!


మ‌ణిపూర్‌లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాల‌కుగాను ఇప్పటికే 38 స్థానాల‌కు తొలి ద‌శ‌లో పోలింగ్ జ‌రిగింది. ఇవాళ 22 స్థానాల‌కు పోలింగ్ నిర్వ‌హిస్తున్నారు. మొత్తం 92 మంది అభ్య‌ర్థులు త‌మ భ‌విత‌వ్యాన్ని ప‌రీక్షించుకుంటున్నారు. రెండో ద‌శ పోలింగ్ కోసం అధికారులు మొత్తం 1247 పోలింగ్ స్టేష‌న్‌ల‌ను ఏర్పాటు చేశారు.

Russia Ukraine war: ఎట్టకేలకు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా.. మానవతా కోణమట!


మొత్తం 22 స్థానాల్లో అధికార బీజేపీ అన్ని స్థానాల్లో పోటీచేస్తుండ‌గా ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ 18 స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను బ‌రిలో నిలిపింది. నేష‌న‌ల్ పీపుల్స్ పార్టీ 11 స్థానాల్లో, జేడీయూ-నాగా పీపుల్స్ ఫ్రంట్ కూట‌మి 10 స్థానాల్లో పోటీప‌డుతున్నాయి. స్వ‌తంత్య్ర అభ్య‌ర్థులు 12 స్థానాల్లో బ‌రిలో దిగారు. ఈనెల 10న ఫలితాలు వెలువడతాయి.
Published by:Madhu Kota
First published:

Tags: Assembly Election 2022, Manipur, Manipur Assembly elections 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు