Home /News /national /

MANIPUR ELECTION 2022 PHASE 1 POLLING IN 38 SEATS BEGAN TODAY CM BIREN SINGH AMONG KEY CANDIDATES MKS

Manipur election 2022 phase 1: మణిపూర్ తొలిదశ పోలింగ్ షురూ.. పూజ చేసి ఓటేసిన సీఎం దంపతులు

ఓటేసిన మణిపూర్ సీఎం

ఓటేసిన మణిపూర్ సీఎం

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ సోమవారం ఉదయం ప్రారంభమైంది. తొలి దశలో ఎన్నికలు జరుగుతోన్న 38 స్థానాల్లో సీఎం బీరేన్ సహా ప్రముఖులున్నారు. పోలింగ్ ఏర్పాట్లలో ఆలస్యం కారణంగా తొలి దశ ఒకరోజు వాయిదా పడటం తెలిసిందే.

ఇంకా చదవండి ...
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో అసెంబ్లీ ఎన్నికలు (Manipur Elections 2022) తొలిదశ పోలింగ్‌ (phase 1 Polling) సోమవారం ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మణిపూర్‌ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలు ఉండగా, తొలి దశలో ఐదు జిల్లాల పరిధిలోని 38 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నిజానికి ఈ ఎన్నికల ఆదివారమే(యూపీ ఐదో దశతోపాటే) జరగాల్సి ఉన్నా, పోలింగ్ ఏర్పాట్లలో ఆలస్యం కారణంగా ఇవాళ్టికి వాయిదా పడటం తెలిసిందే.

తొలివిడతలోని 38 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 1,721 పోలింగ్‌ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. మొత్తం 173 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. వీరిలో మహిళా అభ్యర్థుల సంఖ్య కేవలం 15గా ఉంది. సీఎం బీరేన్‌ సింగ్‌, ఉపముఖ్యమంతి కూడా తొలివిడత బరిలో నిలిచారు. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఇంపాల్ లోని తన నివాసంలో భార్యతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, శివం హైస్కూలులోని బూత్ కు వెళ్లి ఓటు వేశారు.

బీజేపీలోకి వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి? -వైఎస్ సునీత సంచలన వాంగ్మూలం! -షాకిచ్చిన గంగాధర్‌రెడ్డి


మణిపూర్ లో మరోసారి బీజేపీనే ప్రజలు ఆశీర్వదిస్తారని సీఎం బీరేన్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మిగిలిన 22 అసెంబ్లీ స్థానాలకు మార్చి 5న రెండో విడుత పోలింగ్‌ జరుగనుంది. అదేనెల 10న ఫలితాలు వెలువడనున్నాయి.

Actress Srabanti: ప్రముఖ హీరోయిన్‌పై కేసు నమోదు.. అలా చేయడం తప్పని తెలీదట!


2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 60 స్థానాలకు గానూ 28 సీట్లను సొంతం చేసుకున్నా కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే 21 స్థానాల్లో మాత్రమే గెలుపొందిన బీజేపీ అధికారం చేపట్టింది. నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ, నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌, స్వతంత్రుల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈసారి బీజేపీ, ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్‌ విడివిడిగా పోటీచేస్తున్నాయి.
Published by:Madhu Kota
First published:

Tags: Assembly Election 2022, Manipur, Manipur Assembly elections 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు