ఎనిమిది అడుగుల లోతులోని మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసిన కార్పొరేటర్..

పారిశుద్ధ్య కార్మికులు రుతుపవనాల సమయంలో ఇది చాలా ప్రమాదకరమని, మ్యాన్‌హోల్ లోపలికి వెళ్లడానికి నిరాకరించారు. అనంతరం మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసేందుకు హై స్పీడ్ వాటర్ జెట్ అమర్చిన వాహనాన్ని పంపాలని నగర కార్పొరేషన్‌ను ఆదేశించారు.


Updated: June 25, 2020, 2:33 PM IST
ఎనిమిది అడుగుల లోతులోని మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసిన కార్పొరేటర్..
మ్యాన్‌హోల్‌లోకి దిగుతున్న కార్పొరేటర్
  • Share this:
ఆయన ఓ బీజేపీ కార్పొరేటర్.. అది మంగళూరు సిటీ కార్పొరేషన్. తుఫాను నేపథ్యంలో ఓ మ్యాన్‌హోల్‌లో ఏదో అడ్డుుపడి వరదల నీరు పొంగిపొర్లుతుంది. అక్కడికి ఓ కార్పొరేటర్ వచ్చాడు. సాధారణంగా ప్రజాప్రతినిధులు అలాంటి సమయంలో పారిశుద్ధ్య కార్మికులను శుభ్రం చేయమని ఆదేశిస్తారు. కానీ బీజేపీ కార్పొరేటర్ మనోహర్ శెట్టి ప్యాంటు కాళ్లా పైకి మడిచి మ్యాన్‌హోల్‌లోకి దిగాడు. ఆయనను అనుసరించి మరో నలుగురు బీజేపీ కార్యకర్తలు మ్యాన్‌హోల్‌లోకి దిగారు. అందరూ కలిసి ఆ మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసి నీరు సాఫీగా పోయేలా చేశారు. ఇప్పుడా ఆ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మంగళూరు సిటీ కార్పొరేషన్ పరిధిలోని ఓ వార్డులోని కద్రీ-కంబాలా వద్ద చెత్త కుప్పలు పోయడంతో భారీ తుఫాను వల్ల మ్యాన్‌హోల్ పొంగిపోయింది. రహదారిపై నీరు ప్రవహిస్తూ ట్రాఫిక్, పాదచారులకు ఇబ్బంది కలిగించింది. ఆ విషయం తెలుసుకున్న కార్పొరేటర్ మనోహర్ శెట్టి అక్కడికి చేరుకున్నారు. అతడు కార్మికులను పిలిచి మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేయాలని కోరారు. కానీ అందుకు పారిశుద్ధ్య కార్మికులు రుతుపవనాల సమయంలో ఇది చాలా ప్రమాదకరమని, మ్యాన్‌హోల్ లోపలికి వెళ్లడానికి నిరాకరించారు. అనంతరం మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసేందుకు హై స్పీడ్ వాటర్ జెట్ అమర్చిన వాహనాన్ని పంపాలని నగర కార్పొరేషన్‌ను ఆదేశించారు. అది కూడా విఫలమైంది. దీంతో ఇదంతా వృథా అనుకున్న మనోహర్ శెట్టి మ్యాన్‌హోల్‌లోకి దిగి నీటి ప్రవాహానికి అడ్డుపడిన చెత్తను తొలగించారు.

Karnataka, Bangalore, Corporator, Manhole, Floodwater, Manohar Shetty, కర్ణాటక, బెంగళూరు, కార్పొరేటర్, మ్యాన్‌హోల్, వరదనీరు, మనోహర్ శెట్టి

ఈ సందర్బంగా కార్పొరేటర్ మనోహర్ శెట్టి న్యూస్ 18తో మాట్లాడుతూ.. మ్యాన్‌హోల్‌లో ఏదో అడ్డుపడి నీరు బయటకు పొంగిపొర్లుతుంది. పారిశుద్ధ్య కార్మికులను శుభ్రం చేయమని అడిగితే.. ప్రస్తుత పరిస్థితుల్లో దిగలేమని చెప్పారు. మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో లాభం లేదనుకున్నా.. వెంటనే మ్యాన్‌హోల్‌లోకి ప్రవేశించి.. అందులో అడ్డుగా ఉన్న పైపును శుభ్రం చేసేందుకు దిగాను. నన్ను చూసి బీజేపీ పార్టీ కార్యకర్తలు నలుగురు నన్ను అనుసరించారు. ఆ మ్యాన్‌హోల్ ఎనిమిది అడుగుల లోతులో ఉంది.

Karnataka, Bangalore, Corporator, Manhole, Floodwater, Manohar Shetty, కర్ణాటక, బెంగళూరు, కార్పొరేటర్, మ్యాన్‌హోల్, వరదనీరు, మనోహర్ శెట్టి

లోపలంతా చీకటిగా ఉంది. టార్చ్ లైట్లు వేసుకుని శుభ్రం చేశామని పేర్కొన్నారు. మా కోసం పైపులను శుభ్రం చేయడానికి పేద ప్రజలను మ్యాన్‌హోల్‌లోకి ప్రవేశించమని మేము బలవంతం చేయలేము. ఏదైనా తప్పు జరిగితే, ఎవరు బాధ్యత తీసుకుంటారు? అందుకే నేను ఆ పని చేయాలని నిర్ణయించుకున్నాను. మేము ప్రతిదానికీ అధికారులపై ఆధారపడలేమని ఆయన చెప్పారు. ఇదిలావుంటే.. మనోహర్ శెట్టి మొదటిసారిగా కార్పొరేటర్‌గా గెలిచాడు.

( డీపీ సతీశ్, బెంగళూరు, న్యూస్18)
First published: June 25, 2020, 2:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading