నా మొబైల్‌ను ట్యాపింగ్ చేశారు... కర్ణాటక సీఎం కుమారస్వామిపై సుమలత ఆరోపణ

Lok Sabha Elections : ఎన్నికల సంఘం అధికారులను కలిసిన సుమలత... తనకు భద్రత కల్పించాలని కోరారు.

Krishna Kumar N | news18-telugu
Updated: March 29, 2019, 6:24 PM IST
నా మొబైల్‌ను ట్యాపింగ్ చేశారు... కర్ణాటక సీఎం కుమారస్వామిపై సుమలత ఆరోపణ
సుమలత
Krishna Kumar N | news18-telugu
Updated: March 29, 2019, 6:24 PM IST
కర్ణాటకలో మాండ్యా నుంచీ లోక్ సభకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుమలత అంబరీష్... అక్కడి జేడీఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకటిన్నర నెల నుంచీ... తన ఇంటి బయట ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు నిఘా పెట్టారన్న ఆమె... వాళ్లను తనను నీడలా వెంటాడుతున్నారని ఆరోపించారు. మీరెవరు... ఇక్కడేం చేస్తున్నారు అని వారిలో కొందర్ని అడగ్గా... ఎలాంటి సమాధానమూ చెప్పలేదని అన్నారు. తన సెక్యూరిటీపై ఆరా తీస్తున్నారనీ, తన దగ్గరకు వచ్చే వారి వివరాలు తెలుసుకుంటున్నారనీ, తన గెస్టులను ఫొటోలు తీస్తున్నారని సుమలత మండిపడ్డారు. తన ఫోన్‌ను ట్యాప్ చేశారన్న ఆమె... సీఎం కుమారస్వామి చీప్ పాలిటిక్స్‌కి పాల్పడుతున్నారని ఆరోపించారు.

ఎన్నికల సంఘం అధికారులను కలిసిన సుమలత... తనకు భద్రత కల్పించాలని కోరారు. తన గురించి ఎవరెవరో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని... తన దగ్గరకు వచ్చే శ్రేయోభిలాషులు చెబుతున్నారన్న సుమలత... ప్రభుత్వం అనధికారిక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి తన ఇంటి చుట్టుపక్కల ఉండేవారికి ఎవరో వెయ్యి రూపాయల చొప్పున డబ్బులు ఇస్తున్నట్లు తన దగ్గర పనిచేసేవాళ్లు తనకు చెప్పారన్న సుమలత... దీనిపై ఈసీకి తెలిపానన్నారు. లిఖిత పూర్వక కంప్లైంట్ ఇవ్వమని ఈసీ కోరినట్లు వివరించారు.

మాండ్య లోక్‌సభ స్థానంలో సుమలతకు పోటీగా... సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నిఖిల్ గౌడ విజయం కోసం జేడీఎస్ నేతలు ఇక్కడ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఐతే... మాండ్యాకు చెందిన స్థానిక కాంగ్రెస్ నేతలు మాత్రం సుమలతకు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ నేతలు సుమలతకు మద్దతివ్వడంపై జేడీఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో... బెంగుళూరులోని డాలర్స్ కాలనీలో మాజీ సీఎం, బీజేపీ నేత యడ్యూరప్పను సుమలత మర్యాదపూర్వకంగా కలిశారు. లోక్‌సభ ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మాండ్య లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో తనకు మద్దతుగా ప్రచారం చేయాలని యడ్యూరప్పను ఆమె ఆహ్వానించినట్లు తెలుస్తోంది. సుమలత గెలుపు కోసం పూర్తి సహకారం అందిస్తామని యడ్యూరప్ప హామీ ఇచ్చారు.

 ఇవి కూడా చదవండి :

చేవెళ్లలో టఫ్ ఫైట్... కొండా విశ్వేశ్వర రెడ్డికి చిరంజీవి అండ... మద్దతుగా ప్రచారం చేస్తారా?

Pics : ఎలుకల పొట్టలో డ్రగ్స్ ప్యాకెట్లు, మొబైల్స్... షాకైన పోలీసులు
Loading...
Pics : బుమ్రా భుజానికి గాయం... ప్రపంచకప్ ఆశలు గల్లంతేనా... విషయాన్ని ఎందుకు దాస్తున్నారు?

అ,ఆలు రావు కానీ... నారా లోకేష్‌పై వైఎస్ షర్మిల సెటైర్లు
First published: March 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...