ప్రియాంకా గాంధీకి లిఫ్ట్ ఇచ్చినందుకు నేతకు ‘ఫైన్’

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రాకు లిఫ్ట్ ఇచ్చిన ఓ కాంగ్రెస్ నేతకు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు జరిమానా విధించారు.

news18-telugu
Updated: December 29, 2019, 10:49 PM IST
ప్రియాంకా గాంధీకి లిఫ్ట్ ఇచ్చినందుకు నేతకు ‘ఫైన్’
ద్విచక్రవాహనంపై వెళ్తున్న ప్రియాంకా గాంధీ వాద్రా
  • Share this:
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రాకు లిఫ్ట్ ఇచ్చిన ఓ కాంగ్రెస్ నేతకు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు జరిమానా విధించారు. ప్రియాంకా గాంధీ వాద్రా నిన్న యూపీ పర్యటించారు. ఈ క్రమంలో స్థానిక సామాజిక ఉద్యమకారుడు, మాజీ ఐపీఎస్ అయిన ఎస్ఆర్ దారాపురిని కలవడానికి వెళ్లారు. అయితే, ఆమె కారును పోలీసులు అడ్డుకున్నారు. అటువైపు వెళ్లడానికి వీల్లేదని చెప్పారు. తన కారును నిలిపివేయడంతో ఆమె ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ద్విచక్రవాహనంపై వెళ్లారు. అయితే, ఈ వాహనం నడిపిన కాంగ్రెస్ నేతకు పోలీసులు జరిమానా విధించారు. హెల్మెట్లు లేకుండా వాహనంపై ప్రయాణం చేసినందుకు రూ.6300 ఫైన్ వేశారు. ఆ స్కూటర్ కాంగ్రెస్ నేత దీరజ్ గుజ్జర్‌కు చెందినది.First published: December 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు