కోకాకోలా, థమ్సప్ అమ్మకాలపై నిషేధం విధించాలంటూ కోరిన వ్యక్తికి సుప్రీం కోర్టుకు రూ.5 లక్షల జరిమానా విధించింది. ఉమేద్సిన్హా పి చావ్డా.. ఆరోగ్యానికి హానీ చేస్తున్నాయని, వాటిని నిషేధించాలంటూ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే తన పిటిషన్లో ప్రత్యేకించి రెండు ప్రముఖ బ్రాండ్స్‌నే ఎందుకు ఎంచుకున్నారనే విషయంపై స్పష్టతనివ్వడంలో విఫలమయ్యారని కోర్టు పేర్కొంది. పిటిషనర్ చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేశారని, కోకో కోలా, థమ్సప్‌లు ఆరోగ్యానికి హానికరం ఏలా అవుతున్నాయో నిరుపించలేకపోయారని న్యాయమూర్తులు డివై చంద్రచూడ్, హేమంత్ గుప్తా, అజయ్ రస్తోగిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు వెల్లడించింది. అందులో భాగంగానే సదరు పిటిషనర్‌కు రూ.5 లక్షల జరిమానా విధించారు.
వాస్తవానికి పిటిషనర్‌కు ఈ అంశంపై ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకుండానే పిటిషన్ దాఖలు చేశారని పేర్కొంది. ఈ విషయంపై పిటిషనర్ తరపు న్యాయవాదిని విచారించిన తర్వాత సుప్రీం కోర్టు స్పందిస్తూ ఆర్టికల్ 32 కింద ప్రజాప్రయోజన వ్యాజ్యంలో ప్రజలకు మేలు చేసే ఏ అంశమూ లేకపోవడం ఆ పిటిషన్‌ను కొట్టి వేశామని చెప్పింది. దీనికితోడు జరిమానాగా రూ.5 లక్షలు నెల రోజుల్లోపు డిపాజిట్ చేయాలని సుప్రీం కోర్టు పిటిషనర్‌ను ఆదేశించింది.
Published by:Narsimha Badhini
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.