కలకలం.. కత్తితో పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించబోయిన వ్యక్తి..

ప్రతీకాత్మక చిత్రం

బైక్‌పై వచ్చిన అతను విజయ్ చౌక్ గేట్ నుంచి లోపలికి ప్రవేశించబోయాడు. అయితే సెక్యూరిటీ సిబ్బంది అతన్ని ఆపి తనిఖీ చేయగా.. కత్తి బయటపడింది.

  • Share this:
    సోమవారం ఉదయం ఢిల్లీలోని పార్లమెంట్ వద్ద కలకలం రేగింది. ఓ వ్యక్తి కత్తితో పార్లమెంట్‌ ఆవరణలోకి ప్రవేశించేందుకు యత్నించగా సెక్యూరిటీ అతన్ని పట్టుకున్నారు. బైక్‌పై వచ్చిన అతను విజయ్ చౌక్ గేట్ నుంచి లోపలికి ప్రవేశించబోయాడు. అయితే సెక్యూరిటీ సిబ్బంది అతన్ని ఆపి తనిఖీ చేయగా.. కత్తి బయటపడింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి ఎవరు..? కత్తితో పార్లమెంట్ ఆవరణలోకి ఎందుకు ప్రవేశించాలనుకున్నాడు..? అన్నది తెలియరావాల్సి ఉంది.

    ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ కారు కూడా ఇలాగే కలకలం రేపింది.2001లో ఉగ్రవాదులు చొరబడిన ద్వారం నుంచి లోపలికి వెళ్లిన ఓ కారు బారికేడ్లను దాటి పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించబోయింది.దాంతో అప్రమత్తమైన అధికారులు స్పైక్స్ యాక్టివేట్ చేయడంతో.. కారు బంపర్ దెబ్బతిని అక్కడే నిలిచిపోయింది. అయితే ఆ కారు మణిపూర్ ఎంపీ, కాంగ్రెస్ నేత డాక్టర్ థోక్చోమ్‌కు చెందినదని ఆ తర్వాత తెలిసింది. ఆ సమయంలో ఆయన కారులో లేరు.పార్లమెంటులో ప్రవేశానికి అనుమతి లేని ద్వారం గుండా కారు లోపలికి రావడంతో కలకలం రేగింది.
    Published by:Srinivas Mittapalli
    First published: