కన్నతల్లి శవాన్నిచెత్తకుండీలో పడేసిన కసాయి కొడుకు

చెత్తకుండీలో కన్నతల్లి శవం

ఆ తల్లి కడుపున పుట్టినందుకు గాను ఆమెకు కనీసం అంత్యక్రియలు కూడా జరపలేదు. తల్లికి అంతిమ సంస్కారం జరపాల్సిన కుమారుడు తన కర్కశ మనస్తత్వాన్ని చాటాడు.

  • Share this:
    కన్నతల్లి.... మనం ఎన్ని ఇచ్చిన.. ఆ రుణాన్ని తీసుకోలేం. తల్లి తన బిడ్డల కోసం అనుక్షణం పడే తపన, ఆవేదనను మనం ఏమిచ్చి కూడా ఆరుణం తీర్చలేం. భగవంతుడు అన్నిచోట్ల ఉండలేకనే అమ్మను సృష్టించాడంటారు. ఆ మాతృమూర్తి కూడా ప్రతీక్షణం తన కన్నబిడ్డల కోసం పరితపిస్తూ ఉంటుంది. అలాంటి అమ్మకు ఓ కన్నబిడ్డ చనిపోయాక కూడా పట్టించుకోలేదు. ఆ తల్లి కడుపున పుట్టినందుకు గాను ఆమెకు కనీసం అంత్యక్రియలు కూడా జరపలేదు. తల్లికి అంతిమ సంస్కారం జరపాల్సిన కుమారుడు తన కర్కశ మనస్తత్వాన్ని చాటాడు. అంత్యక్రియలకు డబ్బులు లేవంటూ కన్నతల్లి శవాన్ని చెత్తకుండీలో పారేసి చేతులు దులుపుకొన్నాడు. ఈ దారుణం తమిళనాడులో చోటుచేసుకుంది.

    తూత్తుకుడి జిల్లా ధనసింగ్‌ నగర్‌కు చెందిన ముత్తులక్ష్మణన్‌ ఆలయ పూజారి. సోమవారం ఉదయం అతని తల్లి వసంతి మృతదేహం చెత్తకుండీలో ఉండటం చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. విచారణలో ముత్తు లక్ష్మణన్‌ తన తల్లి శవాన్ని చెత్తకుండీలో పడేేసి వెళ్లినట్లు తేలిందిల. వయోభారం కారణంగా తల్లి మృతి చెందిందని, అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో ఈ పని చేసినట్లు ముత్తులక్ష్మణన్‌ తెలిపాడు.
    Published by:Sulthana Begum Shaik
    First published: