దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని బెంగళూరులోని(Bangalore) అశోక్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతడు దొంగతనం(Robbery) చేశాక ఏం చేస్తున్నాడో తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. ఆ దొంగ(Thief) పేరు జాన్ అలియాస్ మంజునాథ్(Manjunath). అతడు దొంగలించిన దాంట్లో సగం డబ్బులు,వస్తువులను దేవాలయాలకు,చర్చిలకు డొనేట్(Donate) చేసి తాను చేసిన తప్పులను క్షమించాలి అని వేడుకుంటాడు అని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా బిక్షగాళ్లకు కూడా అతడు దోచుకున్న డబ్బులను పంచుతాడని తెలిపారు. ఇటీవల జాన్ అలియాస్ మంజునాథ్..ఓనర్ జీతం పెంచలేదని తాను పనిచేసే ఇంట్లోనే రే.2 లక్షలు దొంగతనం చేశాడని పోలీసులు తెలిపారు.
కాగా,కొద్దిరోజుల క్రితం ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఓ దొంగని పట్టుకుని పోలీసు స్టేషన్‌లో అధికారులు కొన్ని ప్రశ్నలు వేయగా.. అతడు చెప్పిన సమాధానాలు ఆసక్తిగా మారాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చోరీ తర్వాత ఎలా అనిపించింది? అని దొంగను పోలీసులు ప్రశ్నించగా...దొంగతనం చేసిన తర్వాత మంచిగానే అనిపించిందని కానీ పశ్చాత్తాపం కూడా కలిగింది సార్ అని సమాధానం ఇచ్చాడు. పశ్చాత్తాపం ఎందుకు కలిగింది? అని పోలీసు అడగగా.... తప్పు పని చేసేశాను సార్.. అని సమాధానం ఇచ్చాడు. దొంగిలించిన వాటితో ఎంత వరకు లభించింది? అని పోలీసు అడిగారు.
ఇదెక్కడి మాస్ రా మామ : చెవిలో పువ్వుతో అసెంబ్లీలోకి మాజీ సీఎం సిద్దరామయ్య
తాను రూ. 10 వేలు దొంగిలించానని, వాటిని పేదలకు పంచేసినట్టు దొంగ సమాధానం చెప్పాడు. ఆవులు, ఇతర జంతువుల కోసం ఖర్చు పెట్టాడని,చలిలో రోడ్డుపై పడుకునే పేదలకు దుప్పట్లు వగైరా కొనుగోలు చేసి పంచిపెట్టానని తెలిపాడు. అలాగైతే ఆశీర్వాదం లభించి ఉంటుంది? అని పోలీసు అనగా.. ఆశీర్వాదం అయితే ఉన్నది సార్ అని ఆ దొంగ సమాధానం చెప్పాడు. ఈ సమాధానంతో ఆ పోలీస్ గదిలో ఉన్న ఇతరులు అందరూ నవ్వారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bangalore, Thief Arrested