అప్పుడెప్పుడో ప్రపోజ్ చేశాడు. ఇప్పుడేమో గొంతునులిమాడు.. రిజెక్ట్ చేసిందన్న కోపంతో రివేంజ్ తీసుకున్నాడు. మరి ఇన్నాళ్లూ ఎక్కడున్నాడు. ఏం చేశాడు..? ప్రేమ రిజెక్ట్ చేసిందని నాలుగేళ్లు కత్తి పట్టుకోని తిరిగాడా..? తాను ప్రేమించిన అమ్మాయి అడ్రస్ ఎలా తెలుసుకున్నాడు..? పక్కా స్కెచ్‌తోనే ఇంటికి వచ్చి దాడి చేశాడా..? అసలేంటీ కథ..?
రిజెక్ట్ చేసిందని రివేంజ్:
గుజరాత్ గాంధీనగర్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ -టిసీఎస్‌లో ప్రాసెస్ అసోసియేట్‌గా పనిచేస్తున్న రిద్ధి సోనిపై తన మాజీ బ్యాచ్‌మేట్ సర్వేష్ రావల్ దాడి చేశాడు. అస్టోడియాలోని ధాల్‌ని పోల్‌లో నివాసం ఉంటున్న సర్వేష్ రావల్ సోని ఇంటికి వెళ్లాడు. డోర్ కొట్టాడు. తలుపు తీసిన సోని షాక్ అయ్యింది. నువ్వెంటిక్కడ అన్నట్లు అడిగింది. తాను సర్‌ప్రైజ్ చేయడానికి వచ్చానని.. మిగిలిన మన బ్యాచ్‌మేట్స్ కూడా దారిలో ఉన్నారని చెప్పాడు సర్వేష్. వెంటనే ఇంట్లోకి ఆహ్వానించింది సోని. ఆ టైమ్‌లో సోని భర్త యష్ కూడా ఇంట్లోనే ఉన్నాడు.
పాల కోసం వెళ్లిన భర్త యష్:
ఇంటికి వచ్చిన సర్వేష్‌ను భర్త యష్‌కు పరిచయం చేసింది సోని. కాసేపు ముగ్గురు మాట్లాడుకున్నారు.టీ పెట్టమని యష్ చెప్పగా పాలు లేవని సోని సమాధానం చెప్పింది. వెంటనే యష్ తాను మిల్క్ తీసుకొస్తానంటూ బయటకు వెళ్లాడు. భర్త లేకపోవడంతో సోని కూడా ఇప్పుడే వస్తానంటూ తన బెడ్‌రూమ్‌లో మిగిలిపోయిన పని చేసుకుంటుంది. ఇంతలోనే సర్వేష్ ఆకస్మాతుగా బెడ్‌రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. సోని జుట్టు పట్టుకోని లాగి పడేశాడు. ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. చేతికి వచ్చిన వస్తువును సోనిపై విసిరాడు. సోనికి ఏం చేయాలో అర్థం కాలేదు. హెల్ప్, హెల్ప్ అంటూ గట్టిగా అరవడం మొదలు పెట్టింది. బెడ్‌రూమ్‌ను ఎలాగో బయటపడి కిచెన్‌లోకి వెళ్లింది. అక్కడ కత్తి తీసుకోని తన జోలికి రావద్దంటూ బెదిరించింది. అయితే ఏ మాత్రం భయపడని సర్వేష్.. ఆ కత్తితో ఆమె చేతిపైనే తిరిగి దాడి చేశాడు. ఇక బయటకు పారిపోయేందుకు ప్రయత్నించిన సోని వీపుపై ఇష్టం వచ్చినట్లు కొట్టాడు సర్వేష్. ఆమె పారిపోకుండా కాళ్లపై కూడా తన్ని పరారయ్యాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న యష్.. సోనికి బ్లడ్ రావాడన్ని గమనించి ఆస్పత్రికి తరలించాడు. ట్రీట్‌మెంట్ తర్వాత సోని, భర్త యష్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సర్వేష్‌పై హత్యాయత్నం కింద ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gujarat