Home /News /national /

Sleep Man: అతడు సంవత్సరంలో 300 రోజులు నిద్రలోనే ఉంటాడు.. కారణం ఏంటంటే..

Sleep Man: అతడు సంవత్సరంలో 300 రోజులు నిద్రలోనే ఉంటాడు.. కారణం ఏంటంటే..

Sleep Man: ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింతలు, విశేషాలు ఉంటాయి. అందులో కొంత మంది కొన్ని వింత వ్యాధులతో బాధపడే వారు కూడా ఉంటారు. అలాంటిదే ఇక్కడ.. ఓ వ్యక్తి సంవత్సరంలో దాదాపు 300 రోజులు నిద్రపోతాడంట.. అది ఎక్కడంటే..

Sleep Man: ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింతలు, విశేషాలు ఉంటాయి. అందులో కొంత మంది కొన్ని వింత వ్యాధులతో బాధపడే వారు కూడా ఉంటారు. అలాంటిదే ఇక్కడ.. ఓ వ్యక్తి సంవత్సరంలో దాదాపు 300 రోజులు నిద్రపోతాడంట.. అది ఎక్కడంటే..

Sleep Man: ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింతలు, విశేషాలు ఉంటాయి. అందులో కొంత మంది కొన్ని వింత వ్యాధులతో బాధపడే వారు కూడా ఉంటారు. అలాంటిదే ఇక్కడ.. ఓ వ్యక్తి సంవత్సరంలో దాదాపు 300 రోజులు నిద్రపోతాడంట.. అది ఎక్కడంటే..

  ఎవరికైనా నిద్ర అనేది చాలా అవసరం. ఎంత ముఖ్యమైన పనులు ఉన్నా నిద్ర పోకుంటే ఆ రోజు ఏ పని చేయలేము. రోజు మొత్తం హుషారుగా ఉండలేము. అందుకే ప్రశాంతమైన నిద్ర కంటే గొప్ప ఆనందం మరొకటి లేదని అంటారు. ఈ విధంగా ప్రతి వ్యక్తి 24 గంటల్లో 7 నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం. ఒకవేళ ఎవరైనా రోజుకు 12 గంటలు నిద్రపోతేనే ఆశ్చర్యపోతాం. అలాంటిది రాజస్థాన్‌‌లోని నగౌర్‌కు చెందిన ఓ వ్యక్తి ఏడాదిలో ఏకంగా 300 రోజులు నిద్రపోతూనే ఉంటాడు. కొందరు దీనివల్ల ప్రజలు ఈ వ్యక్తిని కుంభకర్ణ అని పిలుస్తారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లా భద్వా గ్రామానికి 42 ఏళ్ల పుర్కారామ్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. వింత వ్యాధితో బాధపడే వారి బాధలు అంతా ఇంతా కాదు. ప్రశాంతంగా నిద్రించేవారిని చాలా అదృష్టవంతులు అంటాం. కొంతమందికి ఇలా మంచం మీద పడుకోగానే వెంటనే నిద్ర వస్తుంది. మరి కొంతమందికి గంటల కొద్దీ పడుకున్నా నిద్ర మాత్రం అసలే రాదు. ఇలా ఇతడు ఈ ఈ వ్యాధి కారణంగా ఒకసారి నిద్రలోకి జారుకున్నాక చాలా రోజులు లేవలేకపోతున్నాడు.

  కుటుంబ సభ్యులు అతడిని మేల్కొలపడానికి చాలా పాట్లు పడాల్సి వస్తోంది. ఒకసారి నిద్రపోయిన తర్వాత 25 రోజులు పడుకుంటాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇది ఇతడికి 23 సంవత్సరాల క్రితం ప్రారంభమైందని వారు పేర్కొన్నారు. గత 23 ఏళ్ల నుంచి అతడి జీవితంలో నిద్రతోనే గడిచిపోయింది. పుర్కారామ్ కావాలనే నిద్రపోతున్నాడని భావిస్తే మాత్రం పొరపాటు అవుతుంది. మొదట అతడిని డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. కానీ అతడి సమస్య మాత్రం తగ్గలేదు. కాలక్రమేణా అతడి సమస్య పెరుగుతూనే వచ్చింది కానీ తగ్గలేదు. అతడు అలా నిద్రపోవడానికి కారణం యాక్సిస్ హైపర్సోమ్నియా అనే అరుదైన వ్యాధే కారణమని కుటుంబీకులు చెబుతున్నారు. వైద్యులు దీనిని అరుదైన వ్యాధి అని పిలుస్తారు. తన భర్త ఈ సమస్యను ఎదుర్కొంటున్నాడని అతడి భార్య లిచ్మి దేవి తెలిపారు. కుటుంబాన్ని పోషించేందుకు అతడు స్థానికంగా ఒక దుకాణం కూడా నడుపుతున్నాడు. నిద్ర సమస్య వల్ల నెలలో కేవలం ఐదు రోజులు మాత్రమే ఆ షాపు తెరుస్తాడు. మిగతా సమయమంతా నిద్రలోనే ఉంటాడు.

  ఒకసారి అతడు నిద్రలోకి జారుకున్నాడంటే ఎవరూ లేపలేరు. ఆర్థిక ఇబ్బందుల వల్ల పుర్కారామ్ కుటుంబికులు అతడి వైద్యం దించలేకపోతున్నారు. పెద్ద మనసుతో ఎవరైనా సాయం చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం 20 నుంచి 25 రోజులు నిద్రలోనే ఉంటున్నాడని వారు పేర్కొన్నారు. అతను స్వయంగా మేల్కొవాలని అనుకుంటాడు కానీ అతని శరీరం అతనికి సహకరించట్లేదని.. అంతకుముందు 18 గంటలు నిద్రపోతే ఇప్పుడు 20-25 రోజులు నిద్రపోతున్నాడన్నారు. నిద్రలో ఉండగానే అతడికి స్నానం చేయిస్తామని, ఆహారం తినిపిస్తామన్నారు. పనిలో ఉన్నప్పుడు కూడా అకస్మాత్తుగా నిద్రలోకి జారుకుంటాడన్నారు. నిద్రలో నుంచి లేవగానే తీవ్రమైన తలనొప్పి వస్తుందని, శరీరానికి వ్యాయామం లేకపోవడం ఇతరాత్ర అనారోగ్య సమస్యలను పుర్కారామ్ ఎందుర్కొంటున్నాడని అతడి భార్య లక్ష్మీ దేవి తెలిపారు. తన కుటుంబానికి ఆర్థిక సాయం చేయల్సిందిగా ఆమె కోరుతోంది.
  Published by:Veera Babu
  First published:

  Tags: Rajastan, Sleep

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు