బిడ్డకు వైద్యం చేయించాలని.. సెల్‌ఫోన్ అమ్మిన తండ్రి..

ప్రైవేటు మెడికల్ షాపుకు వెళ్లి అక్కడ వ్యాక్సిన్ కావాలని అడగ్గా.. దాని ఖరీదు రూ. 4,500 అని చెప్పారు. అతని వద్ద కేవలం రూ.2 వేలు మాత్రమే ఉండటంతో మిగతా డబ్బుల కోసం సెల్‌ఫోన్ అమ్మేసి వ్యాక్సిన్‌ను కొన్నాడు.

news18-telugu
Updated: August 20, 2019, 1:16 PM IST
బిడ్డకు వైద్యం చేయించాలని.. సెల్‌ఫోన్ అమ్మిన తండ్రి..
(Photo: ANI)
  • Share this:
కన్న బిడ్డకు వైద్యం చేయించేందుకు సెల్‌ఫోన్ అమ్మాడో తండ్రి. చికిత్సకు కావాల్సిన మందులకు చేతిలో డబ్బుల్లేక తన సెల్‌ఫోన్‌ను అమ్మేసి కూతురిని కాపాడుకున్నాడు. ఈ ఘటన హరియాణాలోని రోహ్‌తక్‌లో చోటుచేసుకుంది. పట్టణానికి సమీపంలోని ఓ గ్రామంలో మూడేళ్ల పాపను వీధి కుక్క కరిచింది. దీంతో ఆ పాపను చికిత్స నిమిత్తం ఆమె తల్లిదండ్రులు ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం రోహ్‌తక్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. వారు పాపను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఆస్పత్రిలో యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ కొరత ఉందని, బయట కొని తెచ్చుకోవాలని వైద్యులు తెలిపారు. ప్రైవేటు మెడికల్ షాపుకు వెళ్లి అక్కడ వ్యాక్సిన్ కావాలని అడగ్గా.. దాని ఖరీదు రూ. 4,500 అని చెప్పారు. అతని వద్ద కేవలం రూ.2 వేలు మాత్రమే ఉండటంతో మిగతా డబ్బుల కోసం సెల్‌ఫోన్ అమ్మేసి వ్యాక్సిన్‌ను కొన్నాడు.

ఆ వ్యాక్సిన్‌ను వైద్యులకు అందించి తన బిడ్డకు వ్యాధి సోకకుండా జాగ్రత్త తీసుకున్నాడు. అయితే, ఆస్పత్రిలో వ్యాక్సిన్ లేకపోవడంపై బాధిత కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ఈ ఘటనపై వైద్య ఉన్నతాధికారులను సంప్రదించగా.. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ వివరణ కోరామని, విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు.

First published: August 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు