Nayanthara - Vignesh Shivan: తమిళ ఇండస్ట్రీలో నయనతారకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ హీరోయిన్‌గా ఈమెకు చాలా ఇమేజ్ ఉంది. మార్కెట్ కూడా అలాగే ఉంది. ఒక్కో సినిమాకు 4 కోట్ల వరకు తీసుకుంటూ టాప్‌లో ఉంది నయన్.
Nayanthara - Vignesh Shivan: తమిళ ఇండస్ట్రీలో నయనతారకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ హీరోయిన్‌గా ఈమెకు చాలా ఇమేజ్ ఉంది. మార్కెట్ కూడా అలాగే ఉంది. ఒక్కో సినిమాకు 4 కోట్ల వరకు తీసుకుంటూ టాప్‌లో ఉంది నయన్.
తమిళ ఇండస్ట్రీలో నయనతారకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ హీరోయిన్‌గా ఈమెకు చాలా ఇమేజ్ ఉంది. మార్కెట్ కూడా అలాగే ఉంది. ఒక్కో సినిమాకు 4 కోట్ల వరకు తీసుకుంటూ టాప్‌లో ఉంది నయన్. ఇదిలా ఉంటే ఈ మధ్యే తన బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్‌ను రహస్యంగా పెళ్లి చేసుకుంది నయనతార. ఇప్పటికీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు నయన్. అయితే తన భర్తతో కలిసి నిర్మాణ సంస్థను కూడా నడుపుతుంది నయనతార.
ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థను రద్దు చేయాలంటూ ఓ పటిషిన్ దాఖలైంది. ఈ నిర్మాణ సంస్థ పేరుతో ప్రజల్లో భయాందోళనలు, అశాంతి నెలకొంటున్నందున వెంటనే ఆ సంస్థపై నిషేధం విధించాలని స్వయం ప్రకటిత సామాజిక కార్యకర్త ఖన్నన్ నగర పోలీసు కమిషనర్‌కు ఓ పిటిషన్ దాఖలు చేసాడు. విఘ్నేష్ శివన్, నయనతార కలిసి రౌడీ పిక్చర్స్ మొదలు పెట్టారు. అందులోనే నయనతార హీరోయిన్‌గా నటించిన నేత్రికన్, కూజంగల్ లాంటి సినిమాలను నిర్మించారు. అవి మంచి విజయం కూడా అందుకున్నాయి.
మరికొన్ని సినిమాలకు సహ నిర్మాతగా ఉన్నారు ఈ ఇద్దరూ. నానుమ్ రౌడీ ధాన్ సినిమా సూపర్ హిట్ కావడంతో.. అదే పేరు నిర్మాణ సంస్థను మొదలు పెట్టాడు విఘ్నేష్ శివన్. అయితే ఈ నిర్మాణ పంస్థ వల్ల అనవసరంగా రౌడీ సంస్కృతి పెరుగుతుందని ఓ పిటిషన్ దాఖలైంది. రౌడీ సంస్కృతిని నియంత్రించాల్సిన బాధ్యత ఉన్న సినిమా వాళ్లే.. ఇలాంటి కల్చర్ ప్రోత్సహిస్తున్నరంటూ ఖన్నన్ ఫిర్యాదు చేసాడు.
రౌడీ సంస్కృతిని అరికట్టాలని పోలీసులు ప్రయత్నిస్తున్నప్పుడు.. నయనతార లాంటి ప్రముఖ వ్యక్తులు తమ కంపెనీకి 'రౌడీ' వంటి పదాలు పెట్టకూడదని సాలిగ్రామ వాసి పిటిషనర్ ఐజి కన్నన్ పేర్కొన్నారు. వెంటనే ప్రొడక్షన్ హౌస్‌ని నిషేధించాలని.. అలాగే విఘ్నేష్ శివన్, నయనతార ఇద్దరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేసే స్థాయికి వెళ్ళాడు. ఇదిలా ఉంటే నయనతార ప్రస్తుతం చాలా బిజీగా ఉంది.
తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్‌లో కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే తమిళంలో కూడా వరస సినిమాలు చేస్తుంది. మరోవైపు సొంత ఇండస్ట్రీ మలయాళంలోనూ ఈమెకు వరస పెట్టి ఛాన్సులు వస్తున్నాయి. ఇంత బిజీగా ఉన్నా కూడా తన భర్త విఘ్నేష్ శివన్‌తో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తుంది నయన్.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.