Home /News /national /

కుక్కను వదిలేసిన యజమాని... కారణం తెలిసి అంతా షాక్

కుక్కను వదిలేసిన యజమాని... కారణం తెలిసి అంతా షాక్

యజమాని వదిలేసిన కుక్క(Photo/ANI)

యజమాని వదిలేసిన కుక్క(Photo/ANI)

తమ పెంపుడు కుక్కలు తప్పిపోతే... వాటి కోసం నిద్రాహారాలు మాని వెతుక్కునే వారి సంఖ్య కూడా ఎక్కువే. అయితే కేరళలోని ఓ వ్యక్తి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించాడు.

    తాము ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్కను వదులుకోవడానికి చాలామంది ఇష్టపడరు. వాటికి ఏ చిన్న కష్టం వచ్చిన విలవిల్లాడిపోతుంటారు. తమ పెంపుడు కుక్కలు తప్పిపోతే... వాటి కోసం నిద్రాహారాలు మాని వెతుక్కునే వారి సంఖ్య కూడా ఎక్కువే. అయితే కేరళలోని ఓ వ్యక్తి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించాడు. తన పెంపుడు కుక్కను మార్కెట్‌లో వదిలి వెళ్లిపోయాడు. ఇంతవరకు బాగానే ఉన్నా... అతడు తన కుక్కను ఎందుకు వదిలాడనే విషయం తెలిసి జంతు సంరక్షకులు షాక్ అయ్యారు. తన కుక్క పక్కంటి కుక్కతో అక్రమ సంబంధం పెట్టుకుందని... అందుకే దీన్ని వదిలేస్తున్నానని దాని యజమాని పేర్కొన్నాడు.

    ఈ విషయాన్ని కుక్క మెడలో ఉన్న కాలర్‌లో పెట్టిన లెటర్‌లో రాసిపెట్టాడు. దీన్ని చదివిన జంతు సంరక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. “ఇది మంచి జాతికి చెందిన కుక్క. బాగా ఉంటుంది. ఎక్కువగా ఆహారం తీసుకోదు. ఎలాంటి రోగాలు కూడా లేవు. ఐదు రోజులకు ఒకసారి స్నానం చేస్తుంది. మెల్లిగా అరుస్తుంది. మూడేళ్లలో ఎవరినీ కరవలేదు. పాలు, బిస్కిట్లు, పచ్చి గుడ్లు తింటుంది” అని లెటర్‌లో రాశాడు. దాని తనతో పాటు ఇంటికి తీసుకెళ్లిన జంతు సంరక్షకురాలు... ఈ రకమైన కారణంతో కుక్కను వదిలేయడాన్ని మొదటిసారి చూస్తున్నారని అన్నారు.
    First published:

    Tags: Dog

    తదుపరి వార్తలు