Home /News /national /

లాక్‌డౌన్‌లో గోధుమ పిండి కోసం బయటకు వచ్చిన వ్యక్తి గుర్తున్నాడా? ఇప్పుడు మరొకరు..

లాక్‌డౌన్‌లో గోధుమ పిండి కోసం బయటకు వచ్చిన వ్యక్తి గుర్తున్నాడా? ఇప్పుడు మరొకరు..

స్వీట్స్ కోసం బయటకు వచ్చానని బోర్డు చూపిస్తున్న వ్యక్తి (Image:Twitter)

స్వీట్స్ కోసం బయటకు వచ్చానని బోర్డు చూపిస్తున్న వ్యక్తి (Image:Twitter)

పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటి వరకు 11,33,433 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 9,88,341 మంది కోలుకున్నారు. కరోనాతో బాధపడుతూ 13,284 మంది మరణించారు.

    కరోనా సెకండ్ వేవ్ విజృంభణంతో మన దేశం విలవిల్లాడుతోంది.  ప్రతి రోజు 4 వేల మందికి పైగా కరోనాకు బలవుతున్నారు. కరోనా కట్టడి కోసం యావత్ దేశం మళ్లీ లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. అంతటా కఠినమైన ఆంక్షలు విధిస్తున్నారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని.. లేదంటే కరోనా బారినపడే ప్రమాదముందని ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నాయి. లాక్‌డౌన్ సమయంలో అనవసరంగా బయటకు వస్తే కేసులు పెడతామని పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. ఐనా కొందరు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. సిల్లీ కారణాలు చెబుతూ బయటకు వస్తున్నారు. గత ఏడాది హైదరాబాద్‌లో ఓ వ్యక్తి గోధుమ పిండి కోసం బయటకు వచ్చానని చెప్పాడు. అప్పట్లో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోనూ అచ్చ అలాంటి సీనే కనిపించింది.

    లాక్‌డౌన్‌లో సమయంలో ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్తూ కనిపించాడు. అక్కడే డ్యూటీలో ఉన్న పోలీసులు లాక్‌డౌన్ టైమ్‌లో బయటకు ఎందుకు వచ్చావు అని ప్రశ్నించాడు. వెంటనే అతడు తన మెడలో వేసుకున్న ఓ బోర్డును చూపించాడు. నేను స్వీట్లు కొనుక్కునేందుకు వెళ్తున్నా.అని దాని మీద రాసి ఉంది. ఆ బోర్డును చూసి పోలీసులకు పట్టరాని కోపం వచ్చింది. '' ఏంటి స్వీట్స్ కోసం బయటకు వచ్చావా? ఛల్.. ఇంటికెళ్లు..'' అని గట్టిగానే గద్దించాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


    ఐతే ఈ వీడియోను చూసిన నెటిజన్లు అతడిపై మండిపడుతున్నారు. లాక్‌డౌన్ సమయంలో స్వీట్స్ కోసం బయటకు రావడం అవసరమా? అని మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం అతడికి మద్దతు తెలుపుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో స్వీట్లు కూడా నిత్యావసర సరుకుల జాబితాలో ఉన్నాయని చెప్పారు. స్వీట్ షాపులకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు అనుమతి ఉందని వెల్లడించారు. ప్రభుత్వమే అనుమతి ఇచ్చినప్పుడు.. అతడు బయటకు వస్తే తప్పేంటని లాజిక్ మాట్లాడుతున్నారు.

    కాగా, పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటి వరకు 11,33,433 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 9,88,341 మంది కోలుకున్నారు. కరోనాతో బాధపడుతూ 13,284 మంది మరణించారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో 1,31,805 యాక్టివ్ కేసులున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Coronavirus, Lockdown, Viral Video, West Bengal

    తదుపరి వార్తలు