ట్రాక్టర్ మిషన్‌లో ఇరుక్కుంటే... గిరగిరా తిప్పేసింది... వైరల్ వీడియో

ఒక్కసారి అనుకోకుండా ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. లక్ బాగుండి... చివర్లో బయటపడతారు. ఈ ఘటనలోనూ అదే జరిగింది. అనుకున్నదొకటైతే... జరిగింది మరొకటైంది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 16, 2019, 10:22 AM IST
ట్రాక్టర్ మిషన్‌లో ఇరుక్కుంటే... గిరగిరా తిప్పేసింది... వైరల్ వీడియో
అలా జరిగితే ఎలా? (Source - Twitter - लगभग नाराज़ आलू Reloaded®)
Krishna Kumar N | news18-telugu
Updated: September 16, 2019, 10:22 AM IST
రెండు ఊర కుక్కలు కొట్టుకుంటున్న వీడియో ఒకటి ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్ అయ్యింది. ఐతే... కుక్కలు కొట్టుకుంటున్నందుకు అది వైరల్ అవ్వలేదు. ఆ కుక్కల్ని ఆపేందుకు కొందరు ప్రయత్నిస్తున్న సమయంలో జరిగిన మరో ఘటన వల్ల ఈ వీడియో వైరల్ అయ్యింది. కుక్కలు విపరీతంగా కొట్టుకుంటుంటే... "వార్నీ ఏమైందిరా వీటికి... ఇట్టా కొట్టేసుకుంటున్నాయ్" అంటూ కొందరు వాటిని ఆపేందుకు కర్రలు, రాడ్డులూ ప్రయోగించారు. కొందరు తమ కాళ్లతోనే కుక్కల్ని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. వాళ్లలో ఓ పెద్దమనిషి... ట్రాక్టర్‌కు సెట్ చేసి ఉన్న రాడ్డుకి తగిలాడు. అప్పటికే ఆ రాడ్డు గిరగిరా తిరుగుతోంది. అతను టచ్ అవ్వగానే... అతన్ని కూడా గిరరిగా తిప్పేసింది. దాంతో అలర్టైన మిగతావారు... ట్రాక్టర్ మిషన్‌ను ఆపేశారు. దాంతో రాడ్డు తిరగడం ఆగింది. అప్పటికే చాలా రౌండ్లు తిరిగేసిన అతను... ప్రాణాపాయం నుంచీ బయటపడ్డాడు.

ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. చాలా మంది నెటిజన్లు... తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కుక్కల్ని కొట్టినందుకు అతనికి ఆ ఖర్మ పట్టిందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. నిజానికి ఇది ఫిట్ భారత్ అనే అకౌంట్‌ పెట్టిన వీడియోకి రిప్లైగా ఓ నెటిజన్ పెట్టిన వీడియో. ఫిట్ భారత్ అకౌంట్ వీడియోలో ఓ కుర్రాడు... ఒకేసారి 30 సార్లు సోమర్‌సాల్ట్స్ చేసి వావ్ అనిపించాడు. అలంటి కుర్రాళ్లను ఒలింపిక్స్‌కి పంపాలని ఓ నెటిజన్ కోరారు. దానికి రిప్లైగా పెట్టిన కుక్కల వీడియో పాకిస్థాన్‌లో షూట్ చేసినట్లు చెబుతున్నా... కచ్చితమైన ఆధారాలు లేవు.
First published: September 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...