ఇంటి పునాదుల్లో దొరికిన బంగారు నిధి.. సంబరపడేలోపే సంతోషం ఆవిరైంది..

పోలీసులు అతని ఇంటికి వచ్చి బంగారం గురించి ఆరా తీశారు. మొదట్లో అలాంటిదేమీ లేదని పోలీసులను బుకాయించే ప్రయత్నం చేశాడు. కానీ తమదైన శైలిలో అడిగేసరికి నిజం బయటపెట్టక తప్పలేదు.

news18-telugu
Updated: September 6, 2019, 6:37 PM IST
ఇంటి పునాదుల్లో దొరికిన బంగారు నిధి.. సంబరపడేలోపే సంతోషం ఆవిరైంది..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఉత్తరప్రదేశ్‌లోని హార్దోయిలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం పునాది తవ్వుతుండగా బంగారు నిధి దొరికింది. అందులో భారీగా బంగారం ఉండటంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. అయితే అతని సంతోషం ఎంతోసేపు నిలవలేదు. విషయం ఆ నోటా ఈ నోటా పోలీసులకు చేరడంతో.. నిధి ఎక్కడ? అంటూ ప్రశ్నించారు. మొదట్లో బుకాయించే ప్రయత్నం చేసినా.. ఇక తప్పదనుకుని అతను కూడా నిధిని అప్పగించేశాడు.

వివరాల్లోకి వెళ్తే.. హార్దోయికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఇంటి నిర్మాణం మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా రెండు రోజులుగా పునాదులు తవ్వుతున్నారు. మంగళవారం పునాది తవ్వుతున్న సందర్భంలో బంగారు నిధి దొరికింది. అందులో 650 గ్రాముల బంగారం,4.53కేజీల వెండి ఉంది. అయితే విషయాన్ని ఎవరికీ చెప్పకుండా నిధిని తానే ఉంచుకోవాలని అతను భావించాడు. అయితే విషయం ఆ నోటా ఈ నోటా పోలీసుల దాకా వెళ్లడంతో సీన్ రివర్స్ అయింది.

పోలీసులు అతని ఇంటికి వచ్చి బంగారం గురించి ఆరా తీశారు. మొదట్లో అలాంటిదేమీ లేదని పోలీసులను బుకాయించే ప్రయత్నం చేశాడు. కానీ తమదైన శైలిలో అడిగేసరికి నిజం బయటపెట్టక తప్పలేదు. దాచిపెట్టిన ఆ నిధిని తీసుకొచ్చి వారికి అప్పగించాడు. ఆ బంగారానికి సంబంధించి అతని వద్ద ఎటువంటి పత్రాలు లేకపోవడంతోనే స్వాధీనం చేసుకున్నామని హర్దోయి ఎస్పీ అలోక్ ప్రియదర్శిని చెప్పారు. వాటి విలువు సుమారు రూ.25లక్షలు ఉంటుందని తెలిపారు. భూమిలో ఎలాంటి ఆభరణాలు దొరికినా.. ఇండియన్ ట్రైజరీ ట్రోవ్ యాక్ట్ 1878 సెక్షన్-4 ప్రకారం ఆ జిల్లాకు చెందిన రెవెన్యూ అధికారులు దాన్ని అప్పగించాలని తెలిపారు.

First published: September 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు