హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Man fight to get Rs 35 refund : రూ.35 కోసం రైల్వేతో పోరాడి..3 లక్షల మందికి లబ్ది చేకూర్చిన ఇంజినీర్

Man fight to get Rs 35 refund : రూ.35 కోసం రైల్వేతో పోరాడి..3 లక్షల మందికి లబ్ది చేకూర్చిన ఇంజినీర్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Man fight with railway : వసూలు చేసిన రూ. 35ను తిరిగి వెనక్కి ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే రూ. 35 చెల్లించాల్సిన రైల్వే 1 మే 2019న ఆయన బ్యాంకు ఖాతాలో రూ. 33 మాత్రమే జమ చేసింది. దీంతో మిగిలిన రెండు రూపాయల కోసం స్వామి మరో మూడేళ్లు పోరాడి విజయం సాధించారు.

ఇంకా చదవండి ...

Man fight to get Rs 35 refund : 35 రూపాయల రిఫండ్‌ కోసం భారత రైల్వేతో(Indian Railways) ఐదేళ్లు పోరాటం చేశాడు ఓ యువ ఇంజినీర్‌. 35 రూపాయలే కదా ఏముందిలేబఅని వదిలేస్తారు కొందరు. ఎన్ని పోలేదు ఈ రూ. 35 ఓ లెక్కా? అని ఉదాసీనంగా ఉండిపోతారు మరికొందరు. కానీ ఈ వ్యక్తి మాత్రం అలా కాదు. రైల్వేతో ఐదేళ్లు పోరాడి తనకు రావాల్సిన రూ. 35 సాధించుకున్నారు. అంతేకాదు ఆయన పోరాటంతో 2.98 లక్షల మందికి లబ్ధి చేకూరడం గమనార్హం.

రాజస్తాన్(Rajastan)లోని కోటాకు చెందిన సుజీత్‌ స్వామి(30) అనే ఇంజినీర్ 2 జులై 2017న గోల్డెన్‌ టెంపుల్‌ మెయిల్ లో కోటా నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఐఆర్‌సీటీసీ ద్వారా ఏప్రిల్‌‌లో టికెట్ బుక్ చేసుకున్నాడు. టికెట్ ధర రూ. 765 చెల్లించారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సుజీత్ స్వామి తన ప్రయాణాన్ని రద్దు చేసుకోవడంతో రూ. 100 మినహాయించుకుని మిగతా మొత్తాన్ని ఐఆర్‌సీటీసీ రిఫండ్ చేసింది. అయితే 2017 జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది. అయితే, అంతకుముందే సుజీత్‌ టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకొన్నారు. కానీ, ఐఆర్‌సీటీసీ టికెట్‌ రద్దుకు సర్వీస్‌ చార్జి పేరుతో రూ.35 ఎక్కువ కట్‌ చేసుకొంది. 2.98 లక్షల మందికి ఇలాగే జరిగింది. నిజానికి కేన్సిలేషన్ రుసుము రూ. 65 మాత్రమే మినహాయించుకోవాల్సి ఉండగా అదనంగా రూ. 35 జీఎస్టీ కింద వసూలు చేయడంపై స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ALSO READ RSS Flag : త్వరలో జాతీయ జెండాగా ఆర్ఎస్ఎస్ జెండా!

తాను జీఎస్టీ అమల్లోకి రాకముందే టికెట్ బుక్ చేసుకున్నానని, అలాంటప్పుడు తన నుంచి జీఎస్టీ ఎలా వసూలు చేస్తారని రైల్వేపై పోరాటానికి దిగారు సుజీత్‌ స్వామి. ఇందులో భాగంగా రైల్వేకు, ఐఆర్‌సీటీసీకి, ఆర్థిక శాఖకు, సేవా పన్నుల శాఖకు ఆర్టీఐ కింద 50 అర్జీలు పెట్టారు. ఫలితంగా దిగొచ్చిన రైల్వే.. జీఎస్టీ పేరుతో అదనంగా వసూలు చేసిన రూ. 35ను తిరిగి వెనక్కి ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే రూ. 35 చెల్లించాల్సిన రైల్వే 1 మే 2019న ఆయన బ్యాంకు ఖాతాలో రూ. 33 మాత్రమే జమ చేసింది. దీంతో మిగిలిన రెండు రూపాయల కోసం స్వామి మరో మూడేళ్లు పోరాడి విజయం సాధించారు. ఆ రెండు రూపాయలను కూడా రైల్వే ఆయన ఖాతాలో జమచేసింది. అంతేకాదు, ఆయన పోరాటంతో మరో 2.98 లక్షల మంది కూడా లబ్ధిపొందారు. జీఎస్టీ అమల్లోకి రావడానికి ముందు టికెట్లు బుక్ చేసుకుని కేన్సిల్ చేసుకున్న 2.98 లక్షల మందికి కూడా రూ. 35 వెనక్కి ఇచ్చేందుకు రెడీ అయింది. ఇందుకోసం మొత్తంగా రూ. 2.43 కోట్లను రైల్వే రీఫండ్ చేయనుంది

First published:

Tags: IRCTC, Train

ఉత్తమ కథలు