చిన్నమ్మాయి పెళ్లి చూపులకొచ్చి...పెద్దమ్మాయిని లేపుకెళ్లాడు!

news18
Updated: June 6, 2018, 2:39 PM IST
చిన్నమ్మాయి పెళ్లి చూపులకొచ్చి...పెద్దమ్మాయిని లేపుకెళ్లాడు!
  • News18
  • Last Updated: June 6, 2018, 2:39 PM IST
  • Share this:
చెన్నై లో ఓ విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. మాములుగా పెళ్లి చూపులకు వెళ్లి అమ్మాయిని చూసి నచ్చిందో లేదో తమ అభిప్రాయం తెలిపి వస్తారు. కానీ ఇక్కడ ప్రబుద్దుడు అమ్మాయిని చూడటానికి వెళ్లి   పెళ్లి అయి ఓ బిడ్డ ఉన్న పెళ్లి కూతురి  అక్కను  లైనులో పెట్టి ఏకంగా లేపుకెళ్ళాడు.

చెన్నై, మైలాపూర్‌, ఏకాంబరం పిళ్లై వీధికి చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు కూతర్లు  ఉన్నారు. వీరిలో పెద్దమ్మాయి వయసు 26 ఏళ్లు. ఈమెకు పెళ్ళై  ఒక కుమారుడు కూడా ఉన్నాడు. దీంతో 22 యేళ్ల చిన్నమ్మాయికి కూడా పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో సంబంధాలు వెతుకుతుండగా, అన్నాదురై (28) అనే యువకుడి సంబంధం గత జనవరిలో వచ్చింది.

పెళ్లి చూపులకు వచ్చిన అతను, ఆసమయంలో పెద్దమ్మాయితో మాట కలిపాడు. చిన్నమ్మాయి పెళ్లి విషయమై ఎలాంటి నిర్ణయాన్ని చెప్పలేదుగానీ, పెద్దమ్మాయితో మాట్లాడుతూ దగ్గరయ్యాడు. ఇదిలా ఉండగా, బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో తన మూడేళ్ల కుమారుడిని వెంటబెట్టుకుని అన్నాదురైతో అక్క ఇల్లు వదిలి లేచిపోయింది.

పెద్ద కూతురు అన్నాదురైతో  వెళ్లిపోయిందని  ఆలస్యంగా తెలుసుకున్న తండ్రి  మైలాపూరు పోలీసులకు గురువారం కంప్లైంట్  ఇచ్చాడు. తన చిన్న కూతురు  పెళ్లిచూపులకు వచ్చిన అన్నాదురైతో పెద్ద కూతురు  లేచిపోయిందని, వెళ్తూ వెళ్తూ ఇంటిలోని  5 సవర్ల నగలు, రూ.2 లక్షలు నగదును తీసుకుని మూడేళ్ల కుమారుడితో సహా పారిపోయిందని పేర్కొన్నాడు. ప్రేమజంట కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
Published by: Sunil Kumar Jammula
First published: June 1, 2018, 6:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading