హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

అప్పుడు పులి... ఇప్పుడు సింహం... తప్పిన ప్రమాదం

అప్పుడు పులి... ఇప్పుడు సింహం... తప్పిన ప్రమాదం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జూలో సింహం ఉండే ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన ఓ యువకుడు... సింహం ముందు ధైర్యంగా నిలబడ్డాడు. దాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు.

  సింహాన్ని దూరం నుంచి చూస్తేనే గుండెలు జారిపోతాయి. సింహాన్ని చూశామనే ఆనందం... మృగరాజు మనకు దగ్గరగా వస్తే ఆవిరైపోతుంది. బోనులో ఉన్న సింహాన్నే దగ్గరి నుంచి చూసేందుకు మనలో చాలామంది సహసించరు. అలాంటిది సింహాం దగ్గరకు వెళితే ఎలా ఉంటుంది ? జూలు విదిల్చిన సింహం ముందు ధైర్యం నిలబడే సాహసం ఎవరైనా చేస్తారా ? కచ్చితంగా చేయరు. కానీ ఢిల్లీ జూలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. జూలో సింహం ఉండే ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన ఓ యువకుడు... సింహం ముందు ధైర్యంగా నిలబడ్డాడు. దాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు.

  ఈ మొత్తం దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే సరిగ్గా సింహం అతడిపై దాడి చేసేందుకు సిద్ధమయ్యే సమయానికి అధికారులు రంగంలోకి దిగారు. అతడిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఆ యువకుడు ఎవరు ? అతడు సింహం దగ్గరకు ఎందుకు వెళ్లాడని విచారణ చేపట్టిన పోలీసులు... అతడి పేరు రెహన్ ఖాన్ అని నిర్ధారణకు వచ్చారు. బీహార్ నుంచి ఢిల్లీ వచ్చిన రెహన్ ఖాన్‌కు మతిస్థిమితం లేదని... అందుకే ఇలా సింహం దగ్గరకు వెళ్లాడని తేల్చారు.

  సరిగ్గా ఐదేళ్ల క్రితం ఢిల్లీకి చెందిన మసూద్ అనే యువకుడు కూడా ఇదే తరహాలో పులి ఉన్న ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లాడు. అయితే అప్పట్లో మసూద్‌ పులి బారిన పడి చనిపోయాడు. పులి అతడిని కర్చుకుని వెళ్లి చంపేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒకవేళ ఢిల్లీ జూ అధికారులు సమయానికి స్పందించి ఉండకపోతే... మసూద్ తరహాలోనే రెహన్ ఖాన్ కూడా సింహం బారి పడి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Delhi, Tiger

  ఉత్తమ కథలు