మెట్రో రైలు డోర్లలో చెయ్యి ఇరుక్కుని ప్రయాణికుడి దుర్మరణం

మెట్రో రైల్లో నియమించిన సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఇందులో ఉందని చెబుతున్నారు. భద్రతా సిబ్బంది రైలు డ్రైవర్‌ను అలర్ట్ చేయడం మానేసి.. సెల్ ఫోన్లో బిజీగా ఉన్నారని ఓ ప్రయాణికుడు ఆరోపించాడు.

news18-telugu
Updated: July 13, 2019, 10:41 PM IST
మెట్రో రైలు డోర్లలో చెయ్యి ఇరుక్కుని ప్రయాణికుడి దుర్మరణం
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: July 13, 2019, 10:41 PM IST
మెట్రో రైలులో ఓ ప్రయాణికుడు చెయ్యి ఇరుక్కుపోయింది. అయితే, ఆ విషయాన్ని గమనించకుండా ట్రైన్ ముందుకు కదలడంతో ఆ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయాడు. కోల్‌కతా మెట్రో రైల్లో ఈ ప్రమాదం జరిగింది. శనివారం సాయంత్రం 6.45 గంటలకు పార్క్ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. పార్క్ స్టేషన్‌లోకి రైలు రాగానే.. ఆవ్యక్తి కూడా మెట్రోలో ఎక్కడానికి ప్రయత్నించాడు. కానీ, రద్దీ ఎక్కువగా ఉండడంతో అందులోకి ఎక్కలేకపోయాడు. ఆ సమయంలో అతడి చెయ్యి కంపార్ట్‌మెంట్ లోపల ఇరుక్కుపోయింది. మెట్రో డోర్లు మూసుకుపోయాయి. మనిషి బయట ప్లాట్ ఫాం మీదే ఉన్నాడు. చెయ్యి మాత్రం తలుపుల మధ్య ఇరుక్కుపోయింది. ఆ సమయంలో రైలు కదిలిపోయింది. మనిషి ట్రైన్‌తోపాటు కొద్దిదూరం పరిగెత్తినా.. ఆ వేగాన్ని అందుకోలేకపోయాడు. చివరకు కిందపడిపోయాడు. దీంతో ప్రాణాలు పోయాయి.

అయితే, మెట్రో రైల్లో నియమించిన సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఇందులో ఉందని చెబుతున్నారు. భద్రతా సిబ్బంది రైలు డ్రైవర్‌ను అలర్ట్ చేయడం మానేసి.. సెల్ ఫోన్లో బిజీగా ఉన్నారని ఓ ప్రయాణికుడు ఆరోపించాడు. చనిపోయిన వ్యక్తిని సాజల్ కుమార్ కనిజాల్ (66)గా గుర్తించారు. ఈ ఘటనపై అత్యున్నత స్థాయి విచారణ జరుపుతామని మెట్రో జీఎం పీసీ శర్మ తెలిపారు. మెట్రో డోర్ల సెన్సార్లు పనిచేయకపోవడం వల్లే అతడి చెయ్యి వాటి మధ్య ఇరుక్కుపోయిందని ప్రాధమికంగా గుర్తించామన్నారు.

First published: July 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...