చాలా మంది ప్రేమించుకుంటారు. కానీ వారు పెళ్లిళ్ల వరకు తమ ప్రేమను తీసుకెళ్లలేక పోతున్నారు. దీంతో ఇష్టం లేని వారిని చేసుకొని జీవితాంతం బాధపడుతున్నారు. కొందరు ప్రేమకున్న (Love) గొప్ప తనాన్ని దిగజారుస్తున్నారు. ఒకరికి తెలియకుండా మరోకరితో ప్రేమాయణాలు నడిపిస్తున్నారు. లవ్ ను ఒక స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు. కేవలం అవసరాల కోసం ప్రేమను (love affair) ఒక పావుగా వాడుకుంటున్నారు. ప్రేమ ముసుగులో అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతున్నారు.
కొందరు మాత్రమే నిజయితీగా ఉండి తమ ప్రేమను గెలిపించుకుంటున్నారు. కొందరు తమ ప్రేమను అంగీకరించలేదని, ప్రేమికులపై దారుణాలకు పాల్పడుతున్నారు. మరికొందరు ప్రేమించిన వారి కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికైన వెనుకాడరు. కొందరు పెద్దలు కుల ప్రస్తావనతో తమ పిల్లల పెళ్లిళ్లు అంగీకరించడం లేదు. మరికొందరు తమ కన్న హోదాలో, ఆస్తి పాస్తులలో తక్కువ అనుకుంటూ కూడా పెళ్లిళ్లను నిరాకరిస్తున్నారు. దీంతో తమ ప్రేమను నిలబెట్టుకోలేక కోంత మంది సూసైడ్ లకు కూడా చేసుకుంటున్నారు. కొందరు కేవలం ప్రేమ అనే వంకతో కలిసి ఉంటారు. పెళ్లి ప్రస్తావన తెగానే తప్పించుకొని తిరుగుతుంటారు. ఇలాంటి ఘటన బీహర్ లో జరిగింది.
పూర్తి వివరాలు.. బీహర్ లోని (Bihar) నవాడా జిల్లాలో ఈ ఘటన జరిగింది. రాజుఖాన్, షబానా పర్వీన్ ఇద్దరు ప్రేమించుకున్నారు. కొనేళ్లుగా రిలేషన్ లో కూడా ఉన్నారు. ఈ క్రమంలో రాజుఖాన్ ది.. ముంగేకర్ అనే గ్రామం కాగా, షబానా ది ఖంకనా పూర్. రాజు తరచుగా షబానాను సీక్రేట్ గా కలుసుకునే వాడు. ఆమె ఎన్నో సార్లు పెళ్ళి ప్రస్తావన తీసుకొచ్చింది. ప్రతి సారి దాటవేసేది. ఈ క్రమంలో రాజు ఖాన్, తన ప్రియురాలిని కలుసుకొవడానికి సీక్రెట్ ఆమె ఇంటికి వచ్చాడు. అయితే, వీరిని కొంత కాలంగా చుట్టుపక్కల వారు గమనిస్తున్నారు.
ఈ క్రమంలో.. బంధువులు, గ్రామస్థులు, రాజుఖాన్ , యువతితో ఉండగా రెడ్ హ్యండేడ్ గా పట్టుకున్నారు. ఆ తర్వాత యువతినికి పెళ్లి చేసుకొవడం ఇష్టమేనా అని అడిగారు. ఆమె ఓకే చెప్పండంతో వెంటనే పెళ్ళి ఏర్పాట్లు చేశారు. అక్కడే పెళ్లితంతు చేసేశారు. ఆ తర్వాత.. ఆమెను అత్తగారింటికి సాగనంపారు. ప్రస్తుతం ఈ క్లిప్పింగ్ లు వైరల్ గా మారాయి.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.