Home /News /national /

MAN BURIED IN TOMB BUILT BY HIM TWO DECADES AGO IN CHAMARAJANAGAR PVN

20 ఏళ్ల క్రితమే తన సమాధి తానే కట్టుకొని,అంత్యక్రియల సామాగ్రి కూడా సిద్ధం చేసుకొని మృతి

పుట్టనంజప్ప సమాధి

పుట్టనంజప్ప సమాధి

Man buried in tomb built by him : కర్ణాటక రాష్ట్రంలోని ఓ సంఘటన ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. చామరాజనగర్ తాలుకాలోకి నంజేదేవనాపూర్‌లో 85 ఏళ్ల పుట్టనంజప్ప అనే వ్యక్తిని 20 ఏళ్ల క్రితం గుర్తించిన స్థలంలో పాతిపెట్టారు.

Man buried in tomb built by him : కర్ణాటక(Karnataka) రాష్ట్రంలోని ఓ సంఘటన ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. చామరాజనగర్(Chamarajanagar) తాలుకాలోకి నంజేదేవనాపూర్‌లో 85 ఏళ్ల పుట్టనంజప్ప అనే వ్యక్తిని 20 ఏళ్ల క్రితం గుర్తించిన స్థలంలో పాతిపెట్టారు. పుట్టనంజప్పకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురూ కూడా ఆర్థికంగా బాగా ఉన్నవారే. అయితే స్వతంత్ర భావాలు కలిగిన పుట్టనంజప్ప తన స్థలంలో 20 ఏళ్లకే ఓ సమాధి(Tomb)ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇసుకతో దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తాను చనిపోయిన తర్వాత తన పిల్లలపై ఆర్థిక భారం పడకూదని పుట్టనంజప్ప ఈ సమాధిని ఏర్పాటు చేశాడు. తాను చనిపోయిన తర్వాత తనను ఈ సమాధిలోనే ఉంచాలని కుటుంబసభ్యులకు తెలిపాడు. పుట్టనంజప్ప 12 రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. తన ముగ్గురు పిల్లలకు రూ.లక్ష ఇచ్చి తన మరణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించాడు.

అయితే ఆదివారం రాత్రి వయోసంబంధిత కారణాలతో పుట్టనంజప్ప ఆదివారం రాత్రి కన్నుమూశాడు. దీంతో తండ్రి కోరికమేరకే అతని శవాన్ని ఆ సమాధిలో ఉంచారు పిల్లలు. గతేడాది పుట్టనంజప్ప భార్య కన్నుమూసింది. ఆమె అంత్యక్రియలను తాను తన కోసం నిర్మించుకున్న సమాధి పక్కనే నిర్వహించాడు. అంతేకాకుండా అంత్యక్రియల కోసం అవసరమైన సామాగ్రిని పుట్టనంజప్ప ముందుగానే సమకూర్చుకున్నారని ఆయన కుమారుడు గౌడికె నగేష్ తెలిపారు.

Visually Challenged Girl : చూపు లేకున్నా చుక్కాని అయింది..500కు 496 మార్కులతో ఫస్ట్ ర్యాంక్

మరోవైపు, మధ్యప్రదేశ్‌(Madhyapradesh)లోని ఖాండ్వా జిల్లాలో ఆదివారం సాయంత్రం ఓ షాకింగ్ సంఘటన జరిగింది. ఓ భర్త తన భార్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీస్ స్టేషన్ వెళ్లగా..పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడంతో ఆగ్రహంతో రేడియో టవర్‌ ఎక్కాడు.  భార్యపై చర్యలు తీసుకోవాలని,లేకుంటే పైనుంచి దూకి చనిపోతానని బెదిరించాడు.తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో చివరిక కిందకు దిగాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సూరజ్‌కుండ్‌లో నివసించే అరుణ్ మిశ్రా ఆదివారం మధ్యాహ్నం ఖాండ్వా పోలీస్ స్టేషన్ కి చేరుకుని తన భార్యపై ఎఫ్‌ఐఆర్‌(FIR) నమోదు చేయాలని పోలీసులను కోరాడు. తన భార్య మరో ప్రేమికుడితో కలిసి పారిపోయిందని, ఇంట్లోని బంగారం, వెండితో సహా అన్ని వస్తువులను దోచుకుందని చెప్పాడు. తాను గోవాలో కూలి పని చేసేవాడినని చెప్పాడు. భార్య తన పేరు మీద చాలా అప్పులు చేసి ఇప్పుడు పారిపోయిందని వాపోయాడు సూరజ్.పోలీసులు అతని ఫిర్యాదును నమోదు చేయలేదు. అరుణ్ కాసేపు ప్రాధేయపడి ఒక్కసారిగా బయటకు వచ్చాడు. ఏమీ అర్థంకాక పోలీసు స్టేషన్ దగ్గర రేడియో టవర్ ఎక్కాడు. టవర్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇంతలో, ఒక పోలీసు అతనిని గమనించి మిగిలిన సహచరులకు సమాచారం ఇచ్చాడు. కొద్దిసేపటికే చాలా మంది పోలీసులు స్టేషన్ నుండి బయటకు వచ్చి సూరజ్ ని కిందకు దిగమని అడగడం ప్రారంభించారు. ఇంతలో స్టేషన్ ఇన్ చార్జి బద్రీలాల్ అటోడే నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా అరుణ్ వినలేదు. తన భార్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందేనని మొండిగా వ్యవహరించాడు. దీంతో పోలీసులు అరుణ్ స్నేహితుడిని సంఘటనా స్థలానికి పిలిపించారు. అరుణ్ స్నేహితుడు వృత్తిరీత్యా న్యాయవాది. అతడు అరుణ్‌తో మొబైల్‌లో మాట్లాడాడు. కాసేపు మాట్లాడిన తర్వాత అరుణ్ కిందకి వచ్చాడు. దీంతో భార్యపై చర్యలు తీసుకోవాలని మళ్లీ పోలీసులను కోరగా, తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Karnataka

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు