ఆమె భర్తను విడిచిపెట్టి ఒంటరిగా ఉంటుంది. ఆమెకు ఒక కూతురు కూడా ఉంది. తల్లికూతుళ్లు తన తండ్రి వద్ద ఉంటున్నారు. ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో జీవిస్తున్నారు. తన భర్తకు విడాకులు ఇచ్చిన ఆమె ఓ ఆటో డ్రైవర్ ను రెండో పెళ్లి చేసుకుంది. ఆమెకు కూతురు ఉందని తెలిసి కూడా అతడు పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె తన బిడ్డను తప్పుడు మార్గంలో నడిపిస్తున్నట్లు అతడికి తెలిసింది. అనుమానం బాగా పెంచుకున్నాడు. వరుసకు బిడ్డ అయ్యే ఆమెతో పాడు పనులు చేయిండం ఇష్టపడని ఇతను ఓ రోజు ఆమెతో గొడవకు దిగాడు. మాటమాట పెరిగి గొడవ పెద్దది అయింది. దీంతో ఆమె తన తండ్రి వద్దకు కూతరును తీసుకొని బయలుదేరింది. తెల్లారి అతడు తన మామ ఇంటికి వెళ్లాడు. అక్కడ కూడా గొడవకు దిగాడు. ఆవేశంతో ఊగిపోయిన అతడు ఆమెను కొట్టడం మొదలు పెట్టాడు. అడ్డు వచ్చిన మామపై బీర్ బాటిల్ తో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే మరణించాడు. వెంటనే అతడు భార్యను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తమిళనాడులోని జామ్ బజార్ పోలీసులు తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
చెన్నై రాయపేట మహ్మద్ హుస్సేన్ వీధికి చెందిన ముసాఫర్ (80) కుమార్తె కౌవుసి నిషా (50)మొదటి భర్తను విడిచి రాయపేట యానైకుళానికి చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్ ఖాదర్ (42)ను పెళ్లి చేసుకుంది. మొదటి భర్త ద్వారా జన్మించిన కుమార్తె(21)తో ఒకే ఇంటిలో ఉంటోంది. కౌవుసి నిషా తన కుమార్తెను తప్పుడు మార్గంలో నడుపుతున్నట్లు అబ్దుల్ ఖాదర్ అనుమానించాడు. అనుమానం పెద్ద పెను భూతంలా మారింది. దీంతో తరచూ వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో కౌవుసి నిషా కుమార్తెతో రాయపేటలో ఉంటున్న తండ్రి ముసాఫర్ ఇంటికి చేరుకుంది. అయినా అబ్దుల్ ఖాదర్ అక్కడకు చేరుకొని గొడవకు దిగాడు.
అడ్డుగా వచ్చిన తన మామను బీర్ బాటిల్‌తో తలపై కొట్టాడు. వెంటనే అతడు కిందపడిపోగా .. కత్తితో భార్య గొంతుకోశాడు. దీంతో ఇద్దరు మరణించారు. సమాచారం అందుకున్న జామ్ బజార్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను ఓమందూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అబ్దుల్ ఖాదర్‌ను పోలీసలు అరెస్టు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai, Crime news, Husband killed by wife, Murder, Tamil nadu, Wife murdered