Home /News /national /

MAN ANNOYED WITH PARROTS WHISTLING FILES COMPLAINT AGAINST HIS NEIGHBOUR UMG GH

Parrot Case: చిలుక తెచ్చిన తంటా.. పోలీస్ స్టేషన్‌కి చేరిన పంచాయితీ.. చదవితే అవాక్కవుతారు..!

చిలుక తెచ్చిన తంటా.. పోలీస్ స్టేషన్‌కి చేరిన పంచాయితీ..

చిలుక తెచ్చిన తంటా.. పోలీస్ స్టేషన్‌కి చేరిన పంచాయితీ..

ఒక వృద్ధుడు తన పొరుగింటి వ్యక్తిపై పోలీస్‌ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు (Complaint) ఇప్పుడు అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఈ వృద్ధుడు తన పొరుగింటి వ్యక్తి పెంచుకునే చిలుక (Parrot) అరుపులు తనని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాయని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
చాలామందికి తమ పొరిగింటి వారి (Neighbours)తో ఏదో ఒక విషయంలో గొడవలు వస్తూనే ఉంటాయి. ఏ ఇబ్బంది పెట్టకుండా పద్ధతిగా ఉండే పొరుగువారు దొరకడం అదృష్టమనే చెప్పాలి. పొరిగింటి వారి వల్ల బాగా ఇబ్బందులు ఎదురైతే కొందరు పోలీస్ స్టేషన్ కూడా ఆశ్రయిస్తుంటారు. అయితే తాజాగా ఒక వృద్ధుడు తన పొరుగింటి వ్యక్తిపై పోలీస్‌ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు (Complaint) ఇప్పుడు అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఈ వృద్ధుడు తన పొరుగింటి వ్యక్తి పెంచుకునే చిలుక (Parrot) అరుపులు తనని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాయని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతను గురువారం (ఆగస్టు 4) రాత్రి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వగా.. అధికారులు చిలుక యజమానిపై నాన్-కాగ్నిజబుల్ కేసు నమోదు చేశారు.

ఆ వృద్ధుడు తన ఇంటి పక్కన నివసించే వ్యక్తి పెంచుకొనే పెంపుడు చిలుక పొద్దస్తమానం కీచు కీచుమని తన చెవులకు చిల్లులు పడేలా అరుస్తోందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాని కీచులాటతో తాను సరిగ్గా నిద్ర కూడా పోలేకపోతున్నానని, ప్రశాంతంగా ఉండలేకపోతున్నానని వాపోయారు.

ఇదీ చదవండి: రక్షా బంధన్‌కి ఇలా ప్లాన్ చేయండి.. మీ సోదరి ఎంత సంతోషిస్తుందో తెలుసా !


వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రలోని పాత పుణే-ముంబై హైవేకి పక్కనే ఉన్న శివాజీనగర్‌లో సురేశ్ షిండే (72) అనే వృద్ధుడు నివసిస్తున్నారు. అతని ఇంటి పక్కన అక్బర్ అమ్జద్ ఖాన్‌ ఉంటున్నాడు. అక్బర్ ఒక చిలుకను కూడా పెంచుకుంటున్నాడు. అతడు తన సొంత ఫ్లాట్ ఎంట్రన్స్ డోర్ వద్ద ఒక బోను కట్టి అందులో తన చిలుకను ఉంచాడట. అలా బోనులో ఉన్న చిలుక క్షణకాలం కూడా విరామం ఇవ్వకుండా రోజంతా అరుస్తూనే ఉందట. అది కీచుకీచుమని చేసే శబ్దాలు తనని బాగా డిస్టర్బ్ చేస్తున్నాయని, దాన్ని కాస్త దూరంగా తీసుకెళ్లాలని సురేశ్ షిండే ఆ చిలుక యజమానికి చెప్పారు. అందుకు బదులుగా ఆ యజమాని స్పందిస్తూ.. "అది నిన్నేమన్నది.. నీ పనేంటో నువ్వు చూసుకో" అని గద్దించాడట. అతడి బెదిరింపులతో బాగా భయపడిపోయిన ఆ వృద్ధుడు ఇక పోలీసులను ఆశ్రయించక తప్పదని ఆగస్టు 5న ఖడ్కీ పోలీస్ స్టేషన్‌ (Khadki police station)కు వెళ్లారు.



తన పొరుగింట్లో నివసిస్తున్న వ్యక్తి ఒక చిలుకను పెంచుకుంటున్నాడని, అది తనని బాగా ఇబ్బంది పెడుతోందని, ఆ విషయం చెబితే యజమాని తనని బెదిరిస్తున్నాడని ఆ వృద్ధుడు ఫిర్యాదు చేశారు. వృద్ధుడి ఫిర్యాదు మేరకు పోలీసులు చిలుక యజమాని అక్బర్‌పై నాన్-కాగ్నిజబుల్ అఫెన్స్ (Non-cognizable Offence) కింద కేసు నమోదు చేశారు. పబ్లిక్‌ ప్రశాంతతకు భంగం కలిగించినందుకు, అలానే బెదిరింపు ఆరోపణలపై అతనిపై కేసు బుక్ చేశారు. అంతేకాకుండా, చిలుక యజమానితో మాట్లాడారు. ఈ చిలుకను ఇంటి లోపల ఉంచాలని, అలా చేస్తే చిలుకతో ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదని యజమానికి విజ్ఞప్తి చేశారు. అలానే, నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని వృద్ధుడికి హామీ ఇచ్చారు. కాగా ఈ కేసు స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.
Published by:Mahesh
First published:

Tags: Crime news, Police Case, Pune, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు