West bengal: పోలీసులు తన కార్యాలయంలో బలవంతంగా ప్రవేశించారు.. సువేందు అధికారి
సువేందు కార్యాలయంలో పోలీసుల రైడ్
Nandigram: పోలీసులు తమను కావాలనే వేధిస్తున్నారని బీజేపీ నేత సువేందు అధికారి అన్నారు. దీనిలో భాగంగానే వారెంట్ లేకుండా తన కార్యాలయంలో వచ్చి బీభత్సం సృష్టించారని పేర్కొన్నారు.
సాధారణంగా రాజకీయాలలో అధికార, ప్రతిపక్షాల మధ్య గొడవలు, బేధాభిప్రాయాలు ఉండటం కామన్. కొన్ని సందర్భాలలో ఆరోపణలు, ప్రత్యారోపణలు పరస్పరం చేసుకుంటూ ఉంటారు. అయితే, కొన్ని సార్లు వీరి మధ్య పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. రాజకీయ నాయకులు తమ కక్ష్య సాధింపు చర్యలకు పోలీసులను ఉపయోగించుకుంటున్నారు. దీంతో డిపార్ట్ మెంట్ కు చెడ్డపేరు వస్తుంది. ఇలాంటి ఘటన వెస్ట్ బెంగాల్ లో జరిగింది. వెస్ట్ బెంగాల్ పోలీసులు ఎలాంటి వారెంట్ లేకుండా, ప్రతి పక్ష నాయకుడి కార్యాలయానికి వెళ్లి సోదాలు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపింది.
పూర్తి వివరాలు.. వెస్ట్ బెంగాల్ లోని (West bengal) నందిగ్రామ్ లో బీజేపీ నేత సువేందు అధికారి కార్యాలయం ఉంది. దీనిలో పోలీసులు ఎలాంటి వారెంట్ లేకుండా ప్రవేశించి అక్కడ బీభత్సాన్ని సృష్టించారు. ఈ ఘటనను బీజేపీ నేతలు ఖండించారు.దీనిపై సువేందు అధికారి, (Suvendu adhikari) వెస్ట్ బెంగాల్ సీఎం మమతబెనర్జీపై (Mamata banerjee) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తన కార్యాలయంపై దాడిని అధికార TMC ప్రభుత్వం యొక్క నీచమైన, క్రూరమైన చర్యగా అభివర్ణించాడు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, సెర్చ్ వారెంట్ చూపకుండా, మేజిస్ట్రేట్ హాజరు లేకుండానే మమత పోలీసులు (పశ్చిమ బెంగాల్ పోలీసులు) అనవసరంగా తన కార్యాలయంలోకి బలవంతంగా ప్రవేశించారని సువేందు అధికారి ఎద్దేవా చేశారు.
कोई पूर्व सूचना दिए बिना, बगैर तलाशी वारण्ट दिखाए, और मजिस्ट्रेट की उपस्थिति के बिना "ममता" पुलिस (पश्चिम बंगाल पुलिस) ने जोर जबरदस्ती मेरे नंदीग्राम विधायक कार्यालय में अनाहूत प्रवेश किया।
यह ममता सरकार की एक घटिया और क्रूर
साजिश है नेता विपक्ष के खिलाफ। pic.twitter.com/EAU5IEBPsg
— Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) May 15, 2022
మమతా కావాలనే రాజకీయ దురుద్దేష్యం తోనే పోలీసులను పావుగా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. పోలీసులకు తాము.. సహకరిస్తామని.. కానీ సెర్చ్ వారెంట్ లేకుండా ప్రవేశించి, కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తించారని అన్నారు. ప్రస్తుతం తన కార్యాలయంలో పోలీసులు చేసిన దాడిని వీడియోలను సువేందు అధాకారి ట్విటర్ లో పోస్ట్ చేశారు. దీనిపై బీజేపీ నేతలు గవర్నర్ జగ్ దీప్ ధన్ కర్ కు (Jagdeep dhankhar) ఫిర్యాదు చేశారు. కాగా, దీనిపై స్పందించిన గవర్నర్... ఘటనపై నివేదిక ఇవ్వాలని సీఎస్ కు ఆదేశించారు. పశ్చిమ బెంగాల్ (West bengal) అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి కార్యాలయంపై ఇటువంటి పోలీసు చర్య తీవ్రమైన ఆందోళన కల్గిస్తుందని గవర్నర్ ధన్ కర్ ఆయన అన్నారు. ప్రస్తుతం సువేందు అధికారి ట్విటర్ లో పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.