హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Shatrughan Sinha: కాంగ్రెస్‌కు మరో భారీ షాక్ : టీఎంసీ అభ్యర్థిగా శత్రుఘ్న సిన్హా: మమత సంచలనం

Shatrughan Sinha: కాంగ్రెస్‌కు మరో భారీ షాక్ : టీఎంసీ అభ్యర్థిగా శత్రుఘ్న సిన్హా: మమత సంచలనం

సినీ నటుడు, రచయిత ‘షాట్ గన్’ శత్రుఘ్న సిన్హా అనూహ్యరీతిలో సొంత పార్టీ కాంగ్రెస్ ను కాదని, టీఎంసీ అభ్యర్థిగా బెంగాల్  ఉప ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు మమతా బెనర్జీ ఆదివారం కీలక ప్రకటన చేశారు.

సినీ నటుడు, రచయిత ‘షాట్ గన్’ శత్రుఘ్న సిన్హా అనూహ్యరీతిలో సొంత పార్టీ కాంగ్రెస్ ను కాదని, టీఎంసీ అభ్యర్థిగా బెంగాల్ ఉప ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు మమతా బెనర్జీ ఆదివారం కీలక ప్రకటన చేశారు.

సినీ నటుడు, రచయిత ‘షాట్ గన్’ శత్రుఘ్న సిన్హా అనూహ్యరీతిలో సొంత పార్టీ కాంగ్రెస్ ను కాదని, టీఎంసీ అభ్యర్థిగా బెంగాల్ ఉప ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు మమతా బెనర్జీ ఆదివారం కీలక ప్రకటన చేశారు.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కుదేలైన కాంగ్రెస్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తూర్పు, ఈశాన్య భారతంలో కాంగ్రెస్ ను సమూలంగా తుడిచేసి, ఆ పార్టీ నేతలను తనలో కలుపుకొనే ప్రయత్నాల్లో బిజీగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ మరో సంచలనానికి తెరలేపింది. కాంగ్రెస్ పార్టీలో గొప్ప వాగ్ధాటి కలిగిన నేతగా పేరున్న సినీ నటుడు, రచయిత ‘షాట్ గన్’ శత్రుఘ్న సిన్హా అనూహ్యరీతిలో సొంతపార్టీని కాదని, టీఎంసీ అభ్యర్థిగా ఉప ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ఆదివారం కీలక ప్రకటన చేశారు.

పశ్చిమ బెంగాల్‌లోని అస‌న్‌సోల్ లోక్‌స‌భ, బాలిగంజ్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలకు ఉప ఎన్నిక జరుగనుంది. ఈసీ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయగా, అధికార టీఎంసీ ఇవాళ తన అభ్యర్థులను ప్రకటించింది. బాలీవుడ్ న‌టుడు నుంచి రాజ‌కీయ నేత‌గా ఎదిగిన శత్రుఘ్న సిన్హాను తృణ‌మూల్ అభ్య‌ర్థిగా అస‌న్‌సోల్ లోక్ సభ స్థానం నుంచి బ‌రిలోకి దింపుతున్నామ‌ని సీఎం మ‌మ‌త ప్ర‌క‌టించారు.

Leopard Meat: ఛీ, వీళ్లు మనుషులేనా?.. చిరుతపులిని చంపి, దాని మాంసం వండుకొని తిన్నారు..

కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిమరీ, బీజేపీకి గుడ్ బై చెప్పి, టీఎంసీలో చేరిన జానపత గాయకుడు బాబుల్ సుప్రియోకు సైతం మమత ప్రాధాన్యం ఇచ్చారు. త్వరలోనే జరగబోయే బాలిగంజ్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నికలో బ‌బుల్ సుప్రియోను తృణ‌మూల్ అభ్య‌ర్థిగా మ‌మ‌తా బెన‌ర్జీ ప్రకటించారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా దీదీ ఈ మేరకు ప్రకటన చేశఆరు.

CM KCR అనూహ్య నిర్ణయం: శాస‌న మండ‌లి చైర్మ‌న్‌గా మళ్లీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి..

‘అస‌న్‌సోల్ పార్ల‌మెంట్ ఉప ఎన్నిక‌ల సంద‌ర్భంగా తృణ‌మూల్ త‌ర‌పున కేంద్ర మాజీ మంత్రి, న‌టుడు శ‌త్రుఘ్న సిన్హాను పార్టీ అభ్య‌ర్థిగా రంగంలోకి దింపుతున్నాం.. ఈ విష‌యం ప్ర‌క‌టించ‌డం ఎంతో హ‌ర్ష‌నీయం. బాలిగంజ్ అసెంబ్లీ ఉప ఎన్నిక సంద‌ర్భంగా కేంద్ర మాజీ మంత్రి, సింగ‌ర్ బ‌బుల్ సుప్రియోను త‌మ పార్టీ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్తున్నాం.. జై హింద్‌, జై బంగ్లా.. జై మాటీ మానుష్’ అంటూ కొద్దిసేపటి కిందట మ‌మ‌త ట్వీట్ చేశారు.

KCRకు షాకిచ్చిన దేవేగౌడ! -బీజేపీ వ్యతిరేక జాతీయ కూటమి కష్టమే -2సార్లు విఫలమయ్యానన్న మాజీ ప్రధాని

శత్రుఘ్న సిన్హా ఎంపికలో మమతా బెనర్జీ అనూహ్య రాజకీయ చతురత ప్రదర్శించారు. బీహార్ కు చెందిన శత్రుఘ్న సిన్హాను బెంగాల్ ఉప ఎన్నిక అభ్యర్థిగా ప్రకటించడమేకాదు, కాంగ్రెస్ కు రాజీనామా చేయకుండానే కనీసం బెంగాల్ లో కాంగ్రెస్-టీఎంసీ పొత్తు లేకుండానే శత్రుఘ్నను మమత తమ అభ్యర్థిగా ఎంపక చేయడాన్ని బట్టి, శతృఘ్న కాంగ్రెస్ ను వీడటం ఖాయమైపోయింది. ఇంతకు మందు, బీహార్ కు చెందిన బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా సైతం టీఎంసీలో చేరడం తెలిసిందే. మరిప్పుడు శతృఘ్న సిన్హా వ్యవహారంపై కాంగ్రెస్ ఎలా స్పందించబోతోందనేది ఆసక్తికంగా మారింది.

Che Guevara: చే గువేరాను కాల్చిచంపిన బొలీవియా మాజీ సైనికుడి మృతి.. అత్యంత నీచమైన క్షణం..

బాలీవుడ్ నుంచి బీహార్ రాజకీయాల్లోకి బీజేపీ ద్వారా ఎంటరైన శతృఘ్న సిన్హా వాజపేయి హయాంలో కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. ప్రధాని మోదీవి ఒంటెద్దుపోకడలంటూ చాలాకాలం విమర్శలు చేసి, 2019 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లోకి చేరిపోయారు సిన్హా. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ కు అధికారికంగా రాజీనామా చేయకుండానే పొరుగురాష్ట్రమైన బెంగాల్ లో టీఎంసీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.

First published:

Tags: Congress, Mamata Banerjee, Shatrughan Sinha, TMC, West Bengal

ఉత్తమ కథలు