హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

యూటర్న్ తీసుకున్న మమతా బెనర్జీ... ప్రధాని మోదీ, అమిత్ షాలపై ఆసక్తికర వ్యాఖ్యలు..

యూటర్న్ తీసుకున్న మమతా బెనర్జీ... ప్రధాని మోదీ, అమిత్ షాలపై ఆసక్తికర వ్యాఖ్యలు..

పీఎం మోదీ, మమతా బెనర్జీ ( ఫైల్)

పీఎం మోదీ, మమతా బెనర్జీ ( ఫైల్)

West bengal: వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యూటర్న్ తీసుకున్నారు. ఈడీ, సీబీఐ కేంద్ర దర్యాప్తు సంస్థలు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తాయని అన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • West Bengal, India

ప్రధాని మోదీ, బీజేపీ పార్టీపై ఎప్పుడు కయ్యానికి కాలుదువ్వే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ( Mamata banerjee) యూటర్న్ తీసుకున్నారు. ప్రస్తుతం మోదీపై (Pm modi)  చేసిన వ్యాఖ్యలు రాజకీయా వర్గాల్లో ఒకింత చర్చనీయాంశంగా మారాయి. కాగా, సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలు కేంద్ర హోమ్ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తాయని అన్నారు. ఇవి ప్రధాని మోదీకి రిపోర్ట్ చేయవని అన్నారు. కానీ చాలా మందికి ఈ విషయం తెలియదని దీదీ వ్యాఖ్యానించారు. దీని వెనుకాల మోదీ ఉన్నట్లు తాను అనుకొవడం లేదని అన్నారు. కొందరు బీజేపీ నాయకులు మాత్రం తనపై కుట్రలు పన్నుతున్నారని దీదీ మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలో ఈడీ, సీబీఐ దాడులకు భయపడి వ్యాపారవేత్తలు, దేశం వదిలిపారిపోతున్నారని మమత అన్నారు. కాగా, బొగ్గు కుంభకోణంకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు మమతా మేనల్లుడిని ప్రశ్నిస్తున్నారు.

అదే విధంగా, ఎంపీ అభిషేక్ బెనర్జీక సహాయం చేయడానికి మమతా ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేత సువేందు అధికారి విమర్శించారు. ఈ రోజు వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలో కేంద్రంలోని బీజేపీ దర్యాప్తు సంస్థలను కావాలని ఉసిగొల్పుతుందని తీర్మానం చేసింది. ఇదిలా ఉండగా మమతా బెనర్జీ మోదీ జన్మదిన వేడుకలల్లో చిరుతల విషయంలో కూడా కొన్ని సలహాలు ఇచ్చారు. అదే విధంగా... వెస్ట్ బెంగాల్ లో నిధులు ఇవ్వోద్దని కొందరు కావాలనే కేంద్రాన్ని పక్కదొవపట్టిస్తున్నారని మమతా అన్నారు. పెగసస్ విషయాన్ని కూడా కొన్ని సలహాలు ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఇతర ఫెడరల్ ఏజెన్సీలకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించిన మొదటి రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచింది.

ఈ మేరకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించారు. తృణమూల్ కాంగ్రెస్(Trinamool Congress) నాయకులపై ఇడి, సిబిఐ (CBI) కొన్ని హై ప్రొఫైల్ కేసులను విచారిస్తున్న తరుణంలో అక్కడి ప్రభుత్వం ఈ రకమైన తీర్మానాన్ని ఆమోదించింది. గత రెండు నెలల్లో పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి, సస్పెండ్ చేయబడిన TMC నాయకుడు పార్థ ఛటర్జీ పాఠశాల సర్వీస్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో అరెస్టయ్యారు. తృణమూల్ బీర్భూమ్ జిల్లా అధ్యక్షురాలు అనుబ్రతా మోండల్ పశువుల అక్రమ రవాణా దర్యాప్తులో అరెస్టయ్యారు.

తృణమూల్ ఎమ్మెల్యేలు నిర్మల్ ఘోష్, తపస్ రాయ్ రాష్ట్ర శాసనసభలో రూల్ 169 కింద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర ఏజెన్సీలు పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ నేతలను ఎంపిక చేసి భయాందోళనకు గురిచేస్తున్నాయని తీర్మానంలో పేర్కొన్నారు. తృణమూల్ సీనియర్ నాయకులు ఫిర్హాద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీలను గత ఏడాది రాష్ట్రంలో 2021 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే నారదా కుంభకోణం విచారణలో అసెంబ్లీ స్పీకర్ అనుమతి తీసుకోకుండా సిబిఐ అరెస్టు చేయడాన్ని కూడా తీర్మానం హైలైట్ చేస్తుంది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Mamata Banarjee, Pm modi, West Bengal

ఉత్తమ కథలు