• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • MAMATA BANERJEES HELICOPTER FLIES FOR 50 MINUTES IN THE AIR TO FIND SMOKE SIGNAL BA

సీఎం టూర్‌లో టెన్షన్.. గాల్లో 50 నిమిషాలు హెలికాప్టర్ చక్కర్లు

సీఎం టూర్‌లో టెన్షన్.. గాల్లో 50 నిమిషాలు హెలికాప్టర్ చక్కర్లు

ప్రతీకాత్మక చిత్రం

15 నిమిషాల్లో గమ్యం చేరుకోవాల్సిన మమతా బెనర్జీ విమానం 50 నిమిషాలైనా రాకపోవడంతో అధికారులు టెన్షన్ పడ్డారు.

  • Share this:
    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారం సందర్భంగా అధికారులు కంగారుపడాల్సిన పరిస్థితి నెలకొంది. 15 నిమిషాల్లో గమ్యం చేరుకోవాల్సిన మమతా బెనర్జీ విమానం 50 నిమిషాలైనా రాకపోవడంతో అధికారులు టెన్షన్ పడ్డారు. ఉత్తర దీనాజ్ పూర్‌లో ఉన్న చోప్రాలో మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది. అందుకోసం ఆమె సిలిగురి నుంచి చాపర్‌లో బయలుదేరారు. సిలిగురి నుంచి చోప్రాకి హెలికాప్టర్‌లో 15 నిమిషాల ప్రయాణం. కానీ, ఆమె 50 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. హెలికాప్టర్ దిగాల్సిన ప్రాంతానికి సంబంధించి పొగ సిగ్నల్ పైలెట్‌కు కనిపించలేదు. దీంతో గాల్లోనే చక్కర్లు కొట్టాడు. మరోవైపు ఆ ప్రాంతం బంగ్లాదేశ్ సరిహద్దు కూడా కావడంతో అధికారులు కొంచె కంగారు పడ్డారు. చివరకు 50 నిమిషాల తర్వాత పైలెట్ చోప్రాలో పొగ సిగ్నల్‌ను గుర్తించాడు. ఆ తర్వాత అక్కడ సురక్షితంగా హెలికాప్టర్ దిగింది.
    First published:

    అగ్ర కథనాలు