• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • MAMATA BANERJEE TAKES OATH AS THE CHIEF MINISTER OF WESTBENGAL FOR A THIRD CONSECUTIVE TERM LATEST UPDATES NK

Mamata Banerjee oath: బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ మూడోసారి ప్రమాణ స్వీకారం

Mamata Banerjee oath: బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ మూడోసారి ప్రమాణ స్వీకారం

బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ మూడోసారి ప్రమాణ స్వీకారం (image credit - twitter - ANI)

Mamata Banerjee Oath-taking Ceremony: మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం తర్వాత చెప్పిన మాటలు, చేసిన వాగ్దానం ప్రత్యర్థి పార్టీలకు సవాల్ అనుకోవాలా? నెక్ట్స్ బెంగాల్ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయి?

  • Share this:
    Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ. ఉదయం 10.45 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ జగదీప్ ధన్కర్‌ సమక్షంలో మమతా బెనర్జీ సీఎంగా ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. కరోనా కారణంగా ఈ కార్యక్రమం సాదాసీదాగా జరిగింది. ఐతే... ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మమతా బెనర్జీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఎక్కడ లేని ఉత్సాహం తెచ్చాయి. ప్రమాణ స్వీకారం తర్వాత... తన మొదటి ప్రాధాన్యం కరోనాయే అన్నారు మమతా బెనర్జీ. "నేను పోలీసులకు సలాం చేస్తున్నా. కరోనాను ఎలా తరిమేయాలో సమీక్ష జరుపుతాను. సాయంత్రం 3 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తాను. ఏయే చర్యలు తీసుకోబోతున్నానో అప్పుడు వివరిస్తాను" అని మమతా బెనర్జీ అన్నారు.

    తన రెండో ప్రాధాన్యం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను క్రమపద్ధతిలో పెట్టడమే అన్నారు మమతా బెనర్జీ. రాజకీయ పార్టీలన్నీ హింసకు ఛాన్స్ ఇవ్వకుండా చెయ్యాలని వేడుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారంగా స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తానని చెప్పారు. కఠిన చర్యలతోనైనా హింసను అణచివేస్తానని మమత అన్నారు.



    2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా మనమంతా కలిసి పోరాడుదాం అని మమత నిన్న పిలుపునిచ్చారు. "నేను ఓ సాధారణ స్ట్రీట్ ఫైటర్‌ని. కానీ నేను బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు ప్రజలకు బూస్ట్ ఇవ్వగలను. ఏదైనా ఎవరైనా ఒంటరిగా సాధించలేరు. కలిసి పోరాడితే సాధించగలరు. కలిసి నిర్ణయం తీసుకుంటే... 2024లో మనం కలిసి పోరాడగలం. దాని కంటే ముందు మనం కరోనా అంతు చూద్దాం. ఆ తర్వాత ఆ సంగతి చూద్దాం. ఇప్పుడు దానికి సమయం కాదు" అని మమత అన్నారు.



    ఇది కూడా చదవండి: India Covid 19: ఇండియాలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, మరణాలు... లేటెస్ట్ అప్‌డేట్స్

    తాజా అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్... 292 స్థానాలకు గానూ... 213 సీట్లతో అద్భుత విజయం సాధించింది. ఇక ప్రతిపక్ష బీజేపీ 77 సీట్లు సాధించింది. ఐతే... బెంగాల్... నందిగ్రామ్ స్థానంలో పోటీ చేసి... బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో కొద్దిపాటి తేడాతో మమతా బెనర్జీ ఓడిపోయారు. కాబట్టి... సీఎం అయ్యాక... నెక్ట్స్ 6 నెలల్లో ఎవరైనా ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి... ఆ స్థానంలో పోటీ చేయాల్సి ఉంటుంది. అప్పుడు గెలిస్తేనే ఆమె సీఎంగా కొనసాగుతారు. లేదంటే... ఆమె ఎమ్మెల్సీ కోటాలో సీఎం కావచ్చు. ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిసిన టీఎంసీకి ఇదేమీ పెద్ద మేటర్ కాదు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు