హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Mamata Banerjee: ఇద్దరు మంత్రుల అరెస్ట్.. సీబీఐ ఆఫీసుకు మమతా బెనర్జీ.. బెంగాల్‌లో టెన్షన్ వాతావరణం

Mamata Banerjee: ఇద్దరు మంత్రుల అరెస్ట్.. సీబీఐ ఆఫీసుకు మమతా బెనర్జీ.. బెంగాల్‌లో టెన్షన్ వాతావరణం

సీబీఐ కార్యాలయం వద్ద పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

సీబీఐ కార్యాలయం వద్ద పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో ఇద్దరు మంత్రులతో పాటు, అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యేను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

  పశ్చిమ బెంగాల్‌లో సోమవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బెంగాల్‌లో సంచలనం సృష్టించిన నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో ఇద్దరు మంత్రులతో పాటు, అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యేను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. సీబీఐ అదుపులోకి తీసుకున్న మంత్రుల్లో ఫీర్హాద్ హకీమ్, సుబ్రత ముఖర్జీ ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ వెంటనే నిజామ్ ప్యాలెస్‌లోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. ఆమెతో పాటు పలు టీఎంసీ నాయకులు, న్యాయవాదులు కూడా ఉన్నారు. నిబంధలనలకు విరుద్దంగా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారని మమతా బెనర్జీ ఆరోపించారు. తనను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

  మరోవైపు సీబీఐ కార్యాయలం వెలుపలు పెద్ద ఎత్తున తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు నిరసన వ్యక్తం చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మరోవైపు సీబీఐ అధికారులు హకీమ్‌ను అదుపులోకి తీసుకున్న సమయంలో దక్షిణ కోల్‌కత్తాలోని ఆయన ఇంటివద్ద ఈరోజు ఉదయం హైడ్రామా చోటుచేసుకుంది. ఆయన ఇంటికి సీబీఐ అధికారులు.. సీబీఐ అధికారులు నిరసన తెలిపారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆయన ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. అనంతరం నిజాం ప్యాలెస్‌లోని సీబీఐ కార్యాలయానికి తరలించారు. ‘నారద స్టింగ్ ఆపరేషన్ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు నన్ను అరస్ట్ చేశారు. ఎలాంటి ముందుస్తు నోటీసులు ఇవ్వకుండా నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. నా అరెస్ట్‌పై నేను కోర్టులో సవాలు చేస్తాను’అని మంత్రి హకీమ్ తెలిపారు. అయితే తాము విచారణ నిమిత్తమే హకీమ్ తీసుకెళ్లినట్టు సీబీఐ తెలిపింది.

  మరోవైపు మంత్రుల అరెస్ట్ అక్రమమని బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ బీమన్ బెనర్జీ తెలిపారు. సీబీఐ అధికారులు తన అనుమతి తీసుకోలేదని చెప్పారు. ఇది బీజేపీ బెంగాల్ ప్రజల మీద చేస్తున్న అతి పెద్ద కుట్ర అని హకీమ్ కూతురు ప్రియదర్శిని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని తిరస్కరించినందుకు కోసంతో ఇలా చేస్తున్నారని విమర్శించారు. తృణమూల్ ఆరోపణలపై స్పందించిన బీజేపీ నేత రాహుల్ సిన్హా సీబీఐ అరెస్ట్‌లతో తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. ఇక, తాజా పరిణామాలతో ఇప్పటికే ఢీ అంటే ఢీ అంటున్న కేంద్రం, మమతా బెనర్జీల మధ్య పోరు మరింత ముదిరినట్టుగా కనిపిస్తోంది.

  ప్రజాప్రతినిధులు లంచం తీసుకుంటున్నట్టు వీడియోలు బయటకు రావడంతో 2017లో ఈ కేసు నమోదైనట్టు సీబీఐ తెలిపింది. ఫీర్హాద్ హకీమ్, సుబ్రత ముఖర్జీ, మిత్రా, ఛటర్జీలను ప్రాసిక్యూషన్ చేసేందుకు బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్ ఈ నెల 7వ తేదీన అనుమతి మంజూరు చేసినట్టు సీబీఐ వెల్లడించింది. ఐపీఎస్ అధికారి హెచ్‌ఎంఎస్ మీర్జా ప్రాసిక్యూషిన్‌కు సంబంధించిన ఆర్డర్స్ ఇదివరకే లభించాయని తెలిపింది. 2019లో అరెస్ట్ అయిన హెచ్‌ఎంఎస్ మీర్జా.. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నట్టు తెలిపింది.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: CBI, Mamata Banerjee, West Bengal

  ఉత్తమ కథలు