• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • MAMATA BANERJEE FIRES ON BJP GOVT FOR CORONA VIRUS INCREASE VRY

Mamata Banerjee : కేంద్రం రాజకీయాల వల్లే కరోనా విజృంభన

Mamata Banerjee  : కేంద్రం రాజకీయాల వల్లే  కరోనా విజృంభన

మమతా బెనర్జీ (File)

Mamata Banerjee : కరోనా విజృంభనకు ముఖ్య కారణం కేంద్ర ప్రభుత్వమే కారణమని బెంగాల్ సిఎం ఆరోపించారు. బెంగాల్ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వ మంత్రి వర్గం మొత్తం ఆరునెలల పాటు బెంగాల్లోనే మకాం వేశారని ఆమె విమర్శించారు.

  • Share this:
కరోనా విజృంభనకు ముఖ్య కారణం కేంద్ర ప్రభుత్వమే కారణమని బెంగాల్ సిఎం ఆరోపించారు. బెంగాల్ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వ మంత్రి వర్గం మొత్తం ఆరునెలల పాటు బెంగాల్లోనే మకాం వేశారని ఆమె విమర్శించారు. దాని ఫలితమే దేశంలో కరోనా ఉదృతం అవుతుందని ఆమె అన్నారు.

దేశాన్ని డబుల్ ఇంజిన్ తరహాలో అభివృద్ది చేస్తామని చెప్పిన కేంద్రం దేశాన్ని పూర్తిగా నాశనం చేశారని ఆమె విమర్శించారు. ప్రభుత్వం పెద్దలు మొత్తం బెంగాల్‌లో మాకం వేయడమే వేసి ఎలాగైనా పాగ వేయాలని కుయుక్తులు పన్నారని అందుకే కరోనా ఉదృతికి కారణం అవుతుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆరునెలల పాటు ఏ మంత్రి కూడ పని చేయలేదని ఆమె దుయ్యబట్టారు.

మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం సహకరించడంతోనే అన్ని సీట్లను గెలుపొందిందని లేదంటే కనీసం ముప్పై సీట్లు కూడ గెలుపొందలేకపోయెదని అమె అన్నారు. అధికారం చేజిక్కకపోవడంతో మతపరమైన కుట్రలకు తెరలేపుతున్నారని సీఎం ఆరోపించారు.ఇక ప్రజలందరికి టీకాలు ఇప్పించే భాధ్యత కేంద్రానిదే మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. టీకాలు ఇప్పించకుండా అనవసరపు ఖర్చులకు కేంద్రం మొగ్గు చూపుతుందని అన్నారు.
Published by:yveerash yveerash
First published: