Durga Puja: దుర్గమ్మ భక్తులకు మమతా బెనర్జీ భారీ వరాలు

పశ్చిమబెంగాల్లోని 30,000కు పైగా ఉన్న దుర్గ పూజ కమిటీలకు ఒక్కో కమిటీకి రూ.50,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.

news18-telugu
Updated: September 24, 2020, 10:13 PM IST
Durga Puja: దుర్గమ్మ భక్తులకు మమతా బెనర్జీ భారీ వరాలు
కోల్‌కతా కాళీ (file)
  • Share this:
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో దుర్గమ్మ భక్తులకు ఓ వరాన్ని ప్రకటించారు. పశ్చిమబెంగాల్లోని 30,000కు పైగా ఉన్న దుర్గ పూజ కమిటీలకు ఒక్కో కమిటీకి రూ.50,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. దీంతో పాటు మరో వరాన్ని కూడా వారికి కల్పించారు. ఈ సంవత్సరం దుర్గ పూజ నిర్వహించే కమిటీల నుంచి ఫైర్ డిపార్ట్‌మెంట్, కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్, ఇతర స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, పంచాయతీలు ఎలాంటి రుసుమును వసూలు చేయకూడదని స్పష్టం చేశాయి. సాధారణంగా దుర్గ పూజ నిర్వహించే మండపాల వద్ద భద్రత, ఫైర్ సేఫ్టీ లాంటివి కల్పించడానికి స్థానికంగా రుసుము వసూలు చేస్తుంటాయి. ప్రభుత్వ శాఖలు వాటిని వసూలు చేస్తాయి. అయితే, ఈ ఏడాది ఎలాంటి రుసుములు వసూలు ఉండదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
ప్రస్తుతం కరోనా వైరస్ సమయంలో దుర్గా పూజ మండపాల నిర్వాహకులు ప్రజల నుంచి చందాలు వసూలు చేస్తున్నారు. అసలే, ఉద్యోగాలుపోయి, ఉపాధి లేని వారికి ఇప్పుడు మండపాల నిర్వాహకులకు చందాలు ఇవ్వాలంటే ప్రజలకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి మండపానికి రూ.50,000 చొప్పున సాయం చేస్తున్నట్టు మమతా బెనర్జీ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే ఈ సాయం, వారికి కొంతమేర అయినా సహాయకారిగా ఉంటుందని చెప్పారు.

దీదీ స్టయిలే వేరు... ఓ సీఎం ఇలా చేయగలరా... | Mamata Banerjee draws circles infront of vegetable shop in kolkata regarding awareness on social distance on corona virus
మమతా బెనర్జీ


రాష్ట్రంలో సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించేందుకు ఈ సాయం చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 30,000 కమిటీలకు ఒక్కొక్కరికి రూ.50,000 చొప్పున అందిస్తే ప్రభుత్వానికి రూ.140 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా. దుర్గ పూజ కమిటీలతో సీఎం మమతా బెనర్జీ సమావేశ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి మరో వరం కూడా ప్రకటించారు. ఈ సంవత్సరం దుర్గ పూజ మండపాలకు విద్యుత్ బిల్లులపై 50 శాతం రాయితీ ఇస్తున్నట్టు తెలిపారు. గత ఏడాది 25 శాతం రాయితీ కల్పించారు.

Vijayawada durga temple, dussera mahostavams, Vijayawada news, ap news, dussera celebrations, విజయవాడ దుర్గ ఆలయం, దసరా మహోత్సవం, విజయవాడ న్యూస్, ఏపీ న్యూస్, దసరా ఉత్సవాలు
విజయవాడ కనకదుర్గ (Twitter Photo)


‘దుర్గ పూజ నిర్వహించే రోజుల్లో ప్రత్యేకంగా ఓ కోవిడ్ 19 హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తాం. అలాగే, ఈ సంవత్సరం ఫైర్ డిపార్ట్‌మెంట్, ఎమర్జెన్సీ సేవలను ఉచితంగా అందించాలని కూడా కోరాను.’ అని మమతా బెనర్జీ చెప్పారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ దుర్గ పూజ కార్నివాల్ నిర్వహించడం లేదని ప్రకటించారు. ‘వచ్చే సంవత్సరం మరింత భారీ ఎత్తున దుర్గ పూజ కార్నివాల్ నిర్వహిస్తాం.’ అని మమతా అన్నారు. పశ్చిమ బెంగాల్లో సుమారు 37,000 దుర్గ పూజ కమ్యూనిటీలు ఉన్నాయి. హౌసింగ్ సొసైటీల్లో ఉండేవి అదనం. అందులో కేవల 1509 రిజిస్టర్డ్ కమిటీలు కోల్‌కతాలోనే ఉన్నాయి.

కోల్‌కతా కాళీ మందిర్ (File;All India Radio/Twitter)
నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ సారధ్యంలోని గ్లోబల్ ఎడ్వైజరీ బోర్డు సూచనల మేరకు ప్రభుత్వ ఈ ఏడాది దుర్గ పూజ మండపాల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంది. మండపాలను పూర్తిస్థాయిలో కప్పి ఉంచొచ్చని, గాలి, వెలుతురు రావడానికి పోవడానికి వీలుగా తెరిచి ఉంచాలని సూచించారు. అలాగే, మండపాల వద్ద పూజల సమయంలో కరోనా నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. భక్తులు ఫేస్ మాస్క్‌లు, ఫేస్ షీల్డ్, శానిటైజర్లు వినియోగించేలా చూడాలన్నారు. తీర్థ ప్రసాదాల వితరణ సమయంలో కూడా జాగ్రత్తలు పాటించాలన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 24, 2020, 10:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading