Home /News /national /

MAMATA BANERJEE ALLEGES HER PHONE IS HACKED SHOCKING COMMENTS AFTER PEGASUS SPYWARE BA

Mamata Banerjee: మమతా బెనర్జీ ఫోన్ హ్యాక్.. బెంగాల్ సీఎం కీలక కామెంట్స్..

మమత బెనర్జీ (పైల్ ఫోటో)

మమత బెనర్జీ (పైల్ ఫోటో)

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోన్ హ్యాక్ అయింది. తన ఫోన్ హ్యాక్ అయిందని ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నానంటూ బెంగాల్ సీఎం దీదీ చెప్పారు.

    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోన్ హ్యాక్ అయింది. తన ఫోన్ హ్యాక్ అయిందని ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నానంటూ బెంగాల్ సీఎం దీదీ చెప్పారు. ఇటీవల పెగాసిస్ స్పై వేర్ సాఫ్ట్ వేర్ దుమారం రేపిన విషయం తెలిసిందే. ప్రముఖుల వ్యక్తిగత భద్రతకు ముప్పువాటిల్లేలా చేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ క్రమంలో ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కామెంట్స్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పెగాసిస్‌కు సంబంధించి ప్రతిపక్షాలు నిర్వహించిన సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి అయిన మమతా బెనర్జీ గైర్హాజరు అయ్యారు. అయితే, మీడియా సమావేశంలో మాత్రం ఆమె దీనిపై స్పందించారు. ‘అన్ని ప్రతిపక్ష పార్టీలు దీనిపై (పెసాగిస్) ఒక్క తాటిపైకి వచ్చి పోరాడాలి. అందరూ కూర్చుని ఓ నిర్ణయానికి రావాలి.’ అని మమతా బెనర్జీ అన్నారు. ఇటీవల బయటకు వచ్చిన పెగాసిస్ బాధితుల జాబితాలో మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పేరు కూడా బయటకు వచ్చింది. ఆయన ఫోన్ కూడా హ్యాక్ అయినట్టు కొన్ని రిపోర్టులు వెలుగుచూశాయి.

    మరోవైపు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయాన్ని నమోదు చేసింది టీఎంసీ. రాబోయే రోజుల్లో జాతీయ స్థాయి రాజకీయాల వైపు మమతా బెనర్జీ చూస్తున్నారనే వార్తలపై ఆమె స్పందించారు. ‘ఏమో నేనేం జ్యోతిష్యురాలిని కాను. ఎవరో ఒకరు నిలబడతారు. నేను సపోర్టు చేస్తాను’ అంటూ నేషనల్ పాలిటిక్స్ లో ప్రతిపక్షాలకు నాయకత్వం వహించడం మీద కామెంట్ చేశారు.

    ఫోన్ హ్యాక్‌పై స్పందించిన మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అభిషేక్ ఫోన్ హ్యాక్ అయింది. నేను అతనితో మాట్లాడాననుకోండి. లేదా ప్రశాంత్ కిశోర్‌తో మాట్లాడాననుకోండి. అప్పుడు నా ఫోన్ కూడా హ్యాక్ అయినట్టే కదా. ఒకరి ఫోన్ హ్యాక్ అయిందంటే అందరి ఫోన్లు హ్యాక్ అయినట్టే. నేను కూడా నా ఫోన్ సరిగా మాట్లాడలేకపోతున్నా.’ అని మమతా బెనర్జీ అన్నారు.

    ఇక పెగాసిస్ స్పై వేర్ మీద దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ దీనికి సంబంధించి తాము విచారణ జరుపుతామంటూ మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రకటించింది. విచారణ కోసం కమిషన్‌ను కూడా నియమించింది. అయితే, కమిషన్‌ ఏర్పాటు న్యాయబద్ధంగా చెల్లుబాటు అవుతుందా? అనే దానిపై కూడా కొందరు న్యాయనిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Hacking, Mamata Banarjee, Mamata Banerjee, West Bengal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు