ఊహించిందే జరిగింది. ఏఐసీసీ ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే (Mallikharjuna Kharge) విజయం సాధించారు. నేడు కౌంటింగ్ అనంతరం వెలువడిన ఫలితాల్లో మల్లికార్జున ఖర్గేకు 7897 ఓట్లు రాగా శశిథరూర్ (Shashi tharoor) కు 1072 ఓట్లు వచ్చాయి. దీనితో మల్లికార్జున ఖర్గే (Mallikharjuna Kharge) 6800పై ఓట్ల మెజారిటీ సాధించారు. మొత్తం ఓట్లలో 415 చెల్లనివిగా అధికారులు గుర్తించారు. ఈ గెలుపుతో కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే (Mallikharjuna Kharge) వ్యవహరించబోతున్నారు. 137 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి 24 ఏళ్ల తరువాత గాంధీయేతర కుటుంబ వ్యక్తి ఏఐసీసీ పీఠం అధిష్టించబోతున్నారు.
#CongressPresidentElection | Mallikarjun Kharge wins the Congress presidential elections with 7897 votes, Shashi Tharoor got about 1000 votes; 416 votes rejected
(File photo) pic.twitter.com/fyBtRF9Tex
— ANI (@ANI) October 19, 2022
అయితే మొదటి నుంచి మల్లికార్జున ఖర్గేనే (Mallikharjuna Kharge) గెలుస్తారని అంతా ఊహించారు. కానీ పోటీలో ఉన్న మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ (Shashi tharoor) కు ఎన్ని ఓట్లు వస్తాయి. ఎంత మెజారిటీ వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా వెలువడిన ఫలితాలలో మల్లికార్జున ఖర్గే (Mallikharjuna Kharge) 6,800 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. కాంగ్రెస్ అధ్యక్షునిగా గెలిచిన ఖర్గేకు శశిథరూర్ (Shashi tharoor) ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. ఇప్పుడు ఎన్నికల అవకతవకలపై చర్చ అనవసరం అని శశిథరూర్ (Shashi tharoor) అభిప్రాయపడ్డారు. మేమంతా కాంగ్రెస్ వాదులం అని థరూర్ చెప్పుకొచ్చారు.
Pm Modi: డిఫెన్స్ ఎక్స్ పోను ప్రారంభించిన ప్రధాని మోడీ..ఇది న్యూ ఇండియా అంటూ కీలక వ్యాఖ్యలు
కాగా ఇంతకు ముందు 1939, 1950, 1977, 1997, 2000 సంవత్సరాల్లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. మళ్లీ 22 ఏళ్ల తర్వాత ఈసారి అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో గాంధీయేతర కాంగ్రెస్ నేతలే పోటీపడ్డారు. అందువల్ల 24 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబేతర నాయకుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలను చేపట్టబోతున్నారు. ఇంతకు ముందు సీతారాం కేసరి గాంధీయేతర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. ఇప్పుడు మళ్లీ మల్లిఖార్జున ఖర్గే గాంధీయేతర కుటుంబం నుండి ఏఐసీసీ పీఠం ఎక్కబోతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.