హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Mallikarjun Kharge: కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాసేపట్లో ఖర్గే ప్రమాణ స్వీకారం.. ఆయన ముందున్న సవాళ్లు ఇవే

Mallikarjun Kharge: కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాసేపట్లో ఖర్గే ప్రమాణ స్వీకారం.. ఆయన ముందున్న సవాళ్లు ఇవే

మల్లిఖార్జున ఖర్గే

మల్లిఖార్జున ఖర్గే

Congress: దాదాపు రెండున్నర దశాబ్ధాల తర్వాత జరిగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లిఖార్జున ఖర్గే విజయం సాధించారు. 137 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి.. 24 ఏళ్ల తరువాత గాంధీయేతర కుటుంబ వ్యక్తి అధ్యక్షుడయ్యారు

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | New Delhi

కాంగ్రెస్ (Congress Party) పార్టీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే  (Mallikarjun Kharge) నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖర్గే ప్రమాణస్వీకార కార్యక్రమానికి సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)తో పాటు సీడబ్ల్యూసీ సభ్యులు, ఎంపీలు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, మాజీ సీఎంలు, మాజీ పీసీసీ అధ్యక్షులు హాజరవుతారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చీఫ్ మధుసూదన్ మిస్త్రీ ఎన్నికల సర్టిఫికెట్‌ను ఖర్గేకు అందజేస్తారు. అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే బాధ్యతలను చేపడతారు.

Ayodhya Ram Temple: అయోధ్యలో శరవేగంగా రామమందిర నిర్మాణం.. ఆ రోజు నుంచే భక్తులకు అనుమతి..

మల్లికార్జున్ ఖర్గే మంగళవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను  ఆయన నివాసంలో కలిశారు. తాజా రాజకీయాలపై చర్చించారు. ఇవాళ ఉదయం  రాజ్‌ఘాట్‌ను సందర్శించి జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. మాజీ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, రాజీవ్ గాంధీల స్మారక ప్రదేశాలతో పాటు మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ స్మారక స్థలాలను కూడా ఆయన సందర్శించారు.

దాదాపు రెండున్నర దశాబ్ధాల తర్వాత జరిగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లిఖార్జున ఖర్గే విజయం సాధించారు. 137 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి.. 24 ఏళ్ల తరువాత గాంధీయేతర కుటుంబ వ్యక్తి అధ్యక్షుడయ్యారు. ఐతే ఆయనకు పలు సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. రాజస్థాన్‌లో నెలకొన్న సంక్షోభంతో పాటు త్వరలో జరగనున్న గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు.. ప్రస్తుతం ఆయన ముందున్న సవాళ్లు..! రాజస్థాన్ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభాన్ని ఎలా డీల్ చేస్తారు? గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయానికి ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తారో చూడాలి. ఐతే పార్టీకి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. పార్టీ పెద్దల సలహాలు సూచనలు స్వీకరిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

కాగా,  కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మల్లిఖార్జున ఖర్గేతో పాటు  శశిథరూర్ పోటీ పడ్డారు.  ఈనెల 17న జరిగిన పోలింగ్‌లో   96 శాతం ఓటింగ్ నమోదయింది.  అక్టోబరు 19న కౌంటింగ్ జరగగా.. మల్లిఖార్జున ఖర్గే విజయం సాధించారు. ఖర్గేకు 7897 ఓట్లు రాగా శశిథరూర్ ) కు 1072 ఓట్లు వచ్చాయి. దీనితో  మల్లికార్జున ఖర్గే 6800పై ఓట్ల మెజారిటీ సాధించారు. మొత్తం ఓట్లలో 415 చెల్లనివిగా అధికారులు గుర్తించారు. ఇవాళ ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుంది.

First published:

Tags: Congress, Mallikarjun Kharge, Rahul Gandhi, Sonia Gandhi

ఉత్తమ కథలు