హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

OMG: పాలిస్తున్న మగ మేక.. లక్షల్లో ధర.. ఇలాంటి వింతను ఎక్కడా చూసి ఉండరు..

OMG: పాలిస్తున్న మగ మేక.. లక్షల్లో ధర.. ఇలాంటి వింతను ఎక్కడా చూసి ఉండరు..

మేకపోతు.. బాద్‌షా

మేకపోతు.. బాద్‌షా

మేకపోతు పాలివ్వడం సాధారణమైన విషయం కాదని సీనియర్ వెటర్నరీ అధికారి బ్రహ్మ కుమార్ పాండే తెలిపారు. లెక్టిన్స్ అనే హార్మోన్ల వల్ల ఇది జరుగుతుందని. . ఇలాంటి మేకపోతులు ఇచ్చే పాల పరిమాణం చాలా తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.

  • Local18
  • Last Updated :
  • Hyderabad, India

ఆవుల్లాగే.. మేకలు కూడా పాలిస్తాయి. ఆవు, గేదె పాల మాదిరే.. మేక పాలను కూడా ఇష్టంగా తాగే వారు మనలో చాలా మంది ఉంటారు. మరి పాలను ఆడ మేక మాత్రమే ఇస్తుందని మనకు తెలుసు. ఆడ జంతువులు మాత్రమే పిల్లల్ని కనగలవు. పాలు ఇవ్వగలవు. ఇదే సృష్టి ధర్మం. కానీ సృష్టికి విరుద్ధమైన విచిత్రమైన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. ఒక మగ మేక.. అంటే మేకపోతు.. పాలివ్వడం.. ఇప్పుడు చర్చనీయాంశమైంది. మేకపోతు పాలివ్వడమేంటి? ఫేక్ అని మీరనుకోవచ్చు. కానీ ఇది నిజం. ఆ మగ మేక.. ఇతర ఆడ మేకల్లాగే... ప్రతిరోజూ పాలు ఇస్తోంది.

కరౌలి జిల్లా సపోత్రా మండలం గోత్ర గ్రామానికి చెందిన అమీర్ ఖాన్‌ పశువుల కాపరిగా పనిచేస్తున్నారు. ఆయన వద్ద పదుల సంఖ్యంలో మేకలున్నాయి. ప్రతిరోజూ వాటిని అడవికి తీసుకెళ్లి.. మేపుకొస్తాడు. ఇదే ఆయన డ్యూటీ..! అమీర్ ఖాన్ పెంచుకుంటున్న మేకల్లో రెండేళ్ల వయసున్న ఓ మేకపోతు ఉంది. దానిని బాద్ షా అని ముద్దుగా పిలుచుకుంటాడు అమీర్ ఖాన్. ఐతే ఈ మేకపోతు.. మిగతా వాటితో పోల్చితే భిన్నమైనది. ఇది మగ జంతువు అయినప్పటికీ.. పురుషాంగం, వృషణాలతో పాటు రెండు పొదుగులను కూడా కలిగి ఉంది. అంతేకాదు.. ఆడ మేక లాగే పాలు ఇస్తోంది. ప్రతి రోజూ 250 మిల్లీ లీటర్ల వరకు పాలను ఇస్తుందని అమీర్ ఖాన్ చెప్పాడు.

చూడటానికి రెండు కళ్లు చాలవు.. శ్రీరామ నవమిరోజు అరుదైన దృశ్యం.. ఎక్కడో తెలుసా

15 ఏళ్లుగా మేకల పెంపకం చేస్తున్న మేక యజమాని అమీర్ ఖాన్.. ఇలాంటి మేకపోతును తాను ఎప్పుడూ చూడలేని.. ఇదే తొలిసారి అని చెబుతున్నాడు. తాను కరణ్‌పూర్‌లోని భైరోగావ్‌లో ఈ మేకపోతను రూ.51,000కు కొనుగోలు చేసినట్లు అమీర్ చెప్పాడు. దీని గురించి తెలిసి.. బంగ్లాదేశ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త రూ. 1 లక్షకు కొనుగోలు చేశారు. త్వరలో ఇది బంగ్లాదేశ్‌కు వెళ్లనుంది.

ఈ మేకపోతు మేత కూడా కాస్త వెరైటీగా ఉంటుంది. ఇది ప్రతిరోజూ గేదె పాలు తాగుతుంది. పాలతో పాటు, ధోవ్ అకాసియా చెట్టు ఆకు, గోధుమ గింజలు, నానబెట్టిన పప్పును ఇష్టంగా లాగిస్తుందట.ఈ మేకపోతు గురించి తెలిసి.. చుట్టు పక్కల ప్రాంతాల వారు దానిని చూసేందుకు వస్తున్నారు.

మేకపోతు పాలివ్వడం సాధారణమైన విషయం కాదని సీనియర్ వెటర్నరీ అధికారి బ్రహ్మ కుమార్ పాండే తెలిపారు. లెక్టిన్స్ అనే హార్మోన్ల వల్ల ఇది జరుగుతుందని. . ఇలాంటి మేకపోతులు ఇచ్చే పాల పరిమాణం చాలా తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. అందుకే వాణిజ్యపరమైన మేకల పెంపకంలో ఇలాంటి సంఘటనలకు పెద్దగా ప్రాధాన్యం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి చాలా అరుదుగా ఉంటాయని... . మిలియన్లలో ఒకటో రెండో మాత్రమే కనిపిస్తాయని అన్నారు.

First published:

Tags: OMG, Rajasthan

ఉత్తమ కథలు