వరదల్లో చిక్కుకున్న స్టార్ హీరోయిన్...స్పెషల్ టీమ్‌తో రెస్క్యూ

భారీ వర్షాలు, కొండచరియల నేపథ్యంలో సుమారు 2వేల మంది పర్యాటకులు ఛత్రులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

news18-telugu
Updated: August 20, 2019, 6:16 PM IST
వరదల్లో చిక్కుకున్న స్టార్ హీరోయిన్...స్పెషల్ టీమ్‌తో రెస్క్యూ
మంజు వారియర్
  • Share this:
హిమాచల్‌ప్రదేశ్‌‌లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొండ చరియలు విరిగిపడడం, వరదనీరు ప్రవహిస్తుండడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. దాంతో కొండప్రాంతాల్లో చాలా మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. సినిమా షూటింగ్ కోసం వెళ్లిన మలయాళం మూవీ 'కయ్యాటమ్' యూనిట్ కూడా లాహోల్ స్పితిలోయలోని ఛత్రులో చిక్కుకుపోయింది. మలయాళ నటి హీరోయిన్ మంజు వారియర్, మూవీ డైరెక్టర్ సనాల్ కుమార్ శశిధరన్‌ సహా 30 మంది అక్కడే ఉండిపోయారు.

ధర్మశాల-కంగ్రా రోడ్డుపై కొండచరియలు విరిగిపడడంతో తామంతా ఛత్రులో చిక్కుకుపోయామని..మంజు వారియర్ తమ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. రెండు రోజులుగా అక్కడే ఉన్నామని..వెంట తెచ్చుకున్న ఆహారం కూడా అయిపోతోందని తెలిపింది. దాంతో ఆమె కుటుంబ సభ్యులు కేరళ అధికారుల సాయంతో హిమాచల్ ప్రదేశ్ అధికారులతో మాట్లాడారు. చిత్ర బృందాన్ని తరలించేందుకు వీలుకాకుంటే కనీసం ఆహార పదార్థాలనైనా అందించాలని కోరారు. విషయం సీఎం జైరాం థాకూర్ దాకా వెళ్లడంతో..ఆయన ప్రత్యేక హెలికాప్టర్లను పంపించి కయ్యాటమ్ మూవీ యూనిట్‌ను ఎయిర్ లిఫ్ట్ చేశారు. అక్కడి నుంచి సిమ్లా తరలించారు. కాగా, ఛత్రు..హిమాచల్ ప్రదేశ్‌లో ప్రముఖ పర్యాటక ప్రాంతం. భారీ వర్షాలు, కొండచరియల నేపథ్యంలో సుమారు 2వేల మంది పర్యాటకులు ఛత్రులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. త్వరలోనే వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని అక్కడి అధికారులు తెలిపారు.First published: August 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు