5 ఐదేళ్లలో 5 ట్రిలియన్ల ఆర్థిక శక్తిగా ఎదగాలి...నీతి ఆయోగ్‌ సమావేశంలో మోదీ

తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు.

news18-telugu
Updated: June 15, 2019, 5:39 PM IST
5 ఐదేళ్లలో 5 ట్రిలియన్ల ఆర్థిక శక్తిగా ఎదగాలి...నీతి ఆయోగ్‌ సమావేశంలో మోదీ
నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం
news18-telugu
Updated: June 15, 2019, 5:39 PM IST
2024 నాటికి 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలన్నారు ప్రదాని మోదీ. ఆర్థిక శక్తిగా అవతరించడం సవాలైనా..సమిష్టి కృష్టితో సాధ్యమేనని తెలిపారు. శనివారంలో ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలకమండలి ఐదో సమావేశం జరిగింది. సమావేశంలో ప్రసగించిన ప్రధాని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్‌లకు దిశా నిర్దేశం చేశారు. దేశంలో ఎన్నికలు పూర్తయ్యాయని..ఇక దేశాభివృద్ధి కోసం అందరం కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. పేదరికం, నిరుద్యోగం, కరువు, వరదలు, కాలుష్యం, అవినీతి, హింసపై పోరాడాలని పిలుపునిచ్చారు.

సబ్‌కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌ అనే నినాదాన్ని ఆచరణలో పెట్టడంలో నీతి ఆయోగ్‌ కీలక పాత్ర పోషిస్తోంది. దేశంలో ఎన్నికల సమరం ముగిసింది. దేశాభివృద్ధిపై ఇక దృష్టిపెడదాం. జీడీపీ వృద్ధి కోసం జిల్లా స్థాయి నుంచే కార్యాచరణ చేపట్టాలి. నీటి సంరక్షణ, నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలి. కొత్తగా ఏర్పాటుచేసిన జల్‌శక్తి మంత్రిత్వశాఖ రాష్ట్రాలకు అవసరమైన సాయం చేస్తుంది ఆదాయ పెంపుదల, ఉపాధి కల్పనలో ఎగుమతి రంగానిదే ముఖ్య పాత్ర అని, ఎగుమతి రంగాన్ని ప్రోత్సహించడంపై రాష్ట్రాలు దృష్టి సారించాలి. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత పాటించాలి.
నరేంద్ర మోదీ


ప్రధానిగా మోదీ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే తొలి నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం. ఈ సమావేశానికి కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మల సీతారామన్, రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. ఐతే తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు.

First published: June 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...