రాణు మండల్ మేకప్ ఫోటో వెనుక అసలు కథ ఇదీ..

ఎవరో ఆకతాయిలు ఆ ఫోటోని మార్ఫింగ్ చేసి వైరల్ చేయడంతో చాలామంది రాణు మండల్‌ను తిట్టిపోశారని అన్నారు. అయితే విమర్శలను కూడా పాజిటివ్‌గానే తీసుకుంటున్నట్టు సంధ్య చెప్పారు.

news18-telugu
Updated: November 21, 2019, 2:07 PM IST
రాణు మండల్ మేకప్ ఫోటో వెనుక అసలు కథ ఇదీ..
రణు మండల్ (credit - Twitter)
  • Share this:
సింగింగ్ సెన్సేషన్ రాణు మండల్‌ 'మేకప్' ఫోటోపై ఇటీవల సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ వచ్చిన సంగతి తెలిసిందే. రాణు మండల్ విపరీతమైన మేకప్‌తో కనిపించిన ఆ ఫోటోని చాలామంది నిజమేనని నమ్మేశారు. దీంతో రాణు మండల్‌ను నెటిజెన్స్ చెడా మడా ట్రోలింగ్ చేశారు. అయితే వాస్తవం వేరే ఉందంటూ మేకప్ ఆర్టిస్ట్ సంధ్య స్పందించారు. రాణు మండల్ ఒరిజినల్ మేకప్ ఫోటోని, సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఫేక్ మేకప్ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన ఓ ఈవెంట్ కోసం రాణు మండల్‌కి తానే మేకప్ చేసినట్టు సంధ్య తెలిపారు. ఎవరో ఆకతాయిలు ఆ ఫోటోని మార్ఫింగ్ చేసి వైరల్ చేయడంతో చాలామంది
రాణు మండల్‌ను తిట్టిపోశారని అన్నారు. అయితే విమర్శలను కూడా పాజిటివ్‌గానే తీసుకుంటున్నట్టు సంధ్య చెప్పారు. నిజానికి నెటిజెన్స్ ట్రోలింగ్స్‌కు తాము కూడా నవ్వుకున్నామని చెప్పారు. అయితే ఇతరుల మనోభావాలను దెబ్బతీయడం సరైంది కాదని.. ఇకనైనా నిజమేంటో తెలుసుకోవాలని సూచించారు. ఒరిజినల్ ఫోటోకి,ఫేక్ ఫోటోకి తేడా గ్రహించాలని సూచించారు.First published: November 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>