హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

News18FarmReformSurvey: వ్యవసాయ సంస్కరణల చట్టాలకు జై కొట్టిన భారతీయులు, న్యూస్‌18 సర్వేలో వెల్లడి

News18FarmReformSurvey: వ్యవసాయ సంస్కరణల చట్టాలకు జై కొట్టిన భారతీయులు, న్యూస్‌18 సర్వేలో వెల్లడి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కేంద్రంలోని నరంద్రమోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలపై ప్రజల్లో ఏ మేరకు అవగాహన ఉందనే అంశానికి సంబంధించి న్యూస్‌18 సర్వే నిర్వహించింది.

కేంద్రంలోని నరంద్రమోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలపై ప్రజల్లో ఏ మేరకు అవగాహన ఉందనే అంశానికి సంబంధించి న్యూస్‌18 సర్వే నిర్వహించింది. ఈ సర్వేలోపలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. దేశంలో వ్యవసాయ సంస్కరణలపై అత్యంత సపోర్ట్ మహారాష్ట్ర (86.10%) ఇచ్చింది. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు మీరు మద్దతు పలుకుతున్నారా? అని ప్రశ్నించగా, మహారాష్ట్ర నుంచి సర్వేలో పాల్గొన్నవారు అత్యధికంగా మద్దతు పలికారు. ఆ తర్వాత ఒడిశా (85.5%), బీహార్ (84.90%), కర్ణాటక (79.9%), పంజాబ్ (78.2%), మధ్యప్రదేశ్ (78.3%), తెలంగాణ (77.9%), రాజస్థాన్ (75.8%) ఆంధ్రప్రదేశ్ (77.9%), హర్యానా (70.0%), ఉత్తర్ ప్రదేశ్ (64.5%) , గుజరాత్ (63.5%), ఢిల్లీ (58.8%) ప్రజలు తమ తమ అభిప్రాయాలు తెలిపారు.

మరోవైపు రైతుల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర విధానం కొనసాగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చిన విషయం మీకు తెలుసా? అని ప్రశ్నించగా ఆ విషయంపై హర్యానా నుంచి సర్వేలో పాల్గొన్న వారు తమకు తెలుసని చెప్పారు. హర్యానా (85.0%) , ఢిల్లీ (76.5%), ఒడిశా (76.5%), బీహార్ (74.8%), కర్ణాటక (71.8%), మధ్యప్రదేశ్ (71.7%), ఉత్తర్ ప్రదేశ్ (62.0%), మహారాష్ట్ర (61.1%), గుజరాత్ (56.5%), పంజాబ్ (56.4%), రాజస్థాన్ (55.6%) , ఆంధ్రప్రదేశ్ (54.3%), తెలంగాణలో (53.2%) శాతం మంది తమకు తెలుసని సమాధానం ఇచ్చారు.

రైతుల ఉద్యమానికి కేంద్రంగా మారిన పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన వారిలో కూడా చాలా మంది వ్యవసాయ సంస్కరణల చట్టాలకు మద్దతు పలకడం విశేషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు 77 శాతానికి పైగా వారు మోదీ తెచ్చిన చట్టాలకు మద్దతిచ్చారు. సర్వేను బట్టి చూస్తే, మోదీ సొంత రాష్ట్రం గుజరాత్, దేశ రాజధాని హస్తిన వాసులు అంతగా మద్దతు నివ్వడం లేదు.

కేంద్రంలో వ్యవసాయ సంస్కరణల కోసం భారత ప్రభుత్వం మూడు చట్టాలు తెచ్చింది. అయితే, వాటిని రద్దు చేయాలని, వాటి వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. పంజాబ్, హర్యానా, గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో 25 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు.

First published:

Tags: Farmers Protest, New Agriculture Acts, Pm modi

ఉత్తమ కథలు