చైనాతో వివాదంలో మోదీకే జై కొట్టిన 73 శాతం.. సీ ఓటర్ సర్వేలో వెల్లడి

ప్రధాని నరేంద్ర మోదీ (File)

జాతీయ భద్రత వంటి అంశాలను డీల్ చేసే విషయంలో ప్రధాని నరేంద్రమోదీపై 72.6 శాతం మంది విశ్వాసం వ్యక్తం చేశారు.

  • Share this:
    చైనాతో వివాదం విషయంలో ప్రధాని మోదీ సారథ్యంలోని ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదని... ఈ కారణంగా భారత్ 20 మంది సైనికులను కోల్పోవాల్సి వచ్చిందని విపక్షాలు విమర్శించాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ విషయంలో ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే అంశంపై సీ ఓటర్ నిర్వహించిన ఆన్ లైన్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చింది. జాతీయ భద్రత వంటి అంశాలను డీల్ చేసే విషయంలో ప్రధాని నరేంద్రమోదీపై 72.6 శాతం మంది విశ్వాసం వ్యక్తం చేశారు. కేవలం 14.4 శాతం మంది మాత్రమే ఈ విషయంలో రాహుల్ గాంధీపై నమ్మకం కనబరిచారు. ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వంపై 73.6 శాతం నమ్మకం ఉంచగా...16.7 శాతం మంది విపక్షంపై విశ్వాసం చూపించారు. 9.6 మంది తటస్థ వైఖరి ప్రదర్శించారు.

    ఇక పాకిస్థాన్ కంటే చైనాతోనే మనకు ఎక్కువ సమస్య అని సర్వేలో పాల్గొన్న చాలామంది అభిప్రాయపడ్డారు. 68 శాతం మంది పాకిస్థాన్ కంటే చైనాతోనే ఎక్కువ సమస్య అని భావించారు. చైనాకు మోదీ ప్రభుత్వం గట్టి జవాబు ఇచ్చారని 39 మంది అభిప్రాయపడగా... ఈ విషయంలో చైనాకు ధీటైన కౌంటర్ ఇవ్వలేకపోయామని 60 శాతం మంది తెలిపారు. ఇక చైనా ఉత్పత్తులు బహిష్కరించే విషయంలోనూ మెజార్టీ నెటిజన్లు అనుకూలంగా స్పందించారు. 68 శాతం మంది చైనా వస్తువులు బాయ్ కాట్ చేస్తారని భావించగా... 31 శాతం మంది చైనా వస్తువులను వినియోగిస్తామని అన్నారు.
    First published: