హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Letter to PM : ప్రధాని మోదీకి విపక్షాల లేఖాస్త్రం.. మరింత రెచ్చగొడుతున్నారా?

Letter to PM : ప్రధాని మోదీకి విపక్షాల లేఖాస్త్రం.. మరింత రెచ్చగొడుతున్నారా?

ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ (File Images)

ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ (File Images)

Letter to PM : నువ్వు తప్పు చేస్తున్నావు అని ఎవర్నైనా అంటే.. వారు ఊరుకుంటారా... నేను చేసేదే రైట్ అంటారు. అంతేకాదు.. నన్నే తప్పంటావా అని మరింతగా రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. అసలు ప్రధాని నరేంద్ర మోదీకి ప్రధాన ప్రతిపక్షాలు లేఖ ఎందుకు రాశాయి? అందులో ఏం రాశాయి? తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ సీఎం కేసీఆర్ సహా... ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మరో నలుగురు ప్రతిపక్ష నేతలు కలిసి.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తోందని లేఖలో ఫైర్ అయ్యారు. కేంద్ర నిఘా వర్గాలను ప్రతిపక్షాలపై కక్షపూరితంగా ప్రయోగిస్తున్నారని లేఖలో మండిపడ్డారు. లిక్కర్ స్కామ్‌లో ఆధారాలు లేకపోయినా... 26 ఫిబ్రవరి 2023న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను CBI అరెస్టు చేసిందని విపక్ష నేతలు ఆరోపించారు. సిసోడియాపై చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవనీ, అంతా రాజకీయ కుట్ర అని పార్టీలు ఆ లేఖలో అభిప్రాయపడ్డాయి.

BRS చీఫ్ కేసీఆర్ , JKNC నేత ఫరూక్ అబ్దుల్లా, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, NCP అధినేత శరద్ పవార్, అప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, శివసేన UBT నేత ఉద్ధవ్ థాక్రే, ఆప్ నేత భగవంత్ మాన్, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, RJD నేత తేజస్వీ యాదవ్ ఈ లేఖను జాయింట్‌గా రాశారు.

ఢిల్లీ స్కూల్ ఎడ్యుకేషన్‌ని తీర్చిదిద్దడం ద్వారా మనీశ్ సిసోడియాకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందనీ... బీజేపీ పాలనలో దేశ ప్రజాస్వామ్య విలువలు పడిపోతుండటాన్ని ప్రపంచం చూస్తోందని విపక్ష నేతలు లేఖలో అన్నారు. 2014 నుంచి దర్యాప్తు సంస్థలు చేస్తున్న దర్యాప్తులు, అరెస్టుల్లో ఎక్కువ శాతం ప్రతిపక్షాల వారివే ఉంటున్నాయని లేఖలో ఆరోపించారు. బీజేపీలో చేరిన వాళ్లపై దర్యాప్తులు మాత్రం ఆలస్యంగా జరుగుతున్నాయని తెలిపారు.

ఇంటర్నేషనల్ ఫోరెన్సిక్ ఫైనాన్షియల్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం.. SBI, LIC సంస్థలు రూ.78వేల కోట్లు విలువ కోల్పోగా... దీనిపై దర్యాప్తు సంస్థలు ఎందుకు దర్యాప్తు చెయ్యట్లేదని ప్రతిపక్ష నేతలు లేఖలో ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ చర్యలు సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయని వారు ఫైర్ అయ్యారు. రాష్ట్రాల్లో గవర్నర్ల వ్యవస్థను కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వాడుకొని... రాజ్యాంగ విలువల్ని మంటకలుపుతున్నారని కూడా లేఖలో తెలిపారు.

ప్రతిపక్షాలు ఇలా ఆరోపిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం తన చర్యలను సమర్థించుకుంటోంది. తప్పు చేయకపోతే.. ఉలుకెందుకు అంటోంది. తప్పు చేసేవాళ్లనూ, అవినీతికి పాల్పడేవాళ్లనూ వదిలేయాలా అని ప్రశ్నిస్తోంది. ఇటు కేంద్రం, అటు విపక్షాల డైలాగ్ వార్స్‌తో దేశ రాజకీయాలు వేడిగానే ఉన్నాయి. మరో ఏడాదిలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న సమయంలో... విపక్షాలు రాసిన ఈ లేఖపై కేంద్రం ఎలా స్పందిస్తుంది? దర్యాప్తు సంస్థల జోరును తగ్గిస్తుందా.. లేక మరింత దూకుడు పెంచేలా చేస్తుందా అనేది నెక్ట్స్ తెలుస్తుంది.

First published:

Tags: CM KCR, Narendra modi

ఉత్తమ కథలు