• HOME
 • »
 • NEWS
 • »
 • NATIONAL
 • »
 • MAJOR CHITRESH BISHT WHO DIED WHILE DEFUSING IED NEAR LOC WAS DUE TO GET MARRIED NEXT MONTH SB

19 రోజుల్లో పెళ్లి... ఇంతలోనే బాంబ్ డిఫ్యూజ్ చేస్తూ ఆర్మీ మేజర్ వీరమరణం

19 రోజుల్లో పెళ్లి... ఇంతలోనే బాంబ్ డిఫ్యూజ్ చేస్తూ ఆర్మీ మేజర్ వీరమరణం

అమర్ జవాన్ చిత్రేష్ సింగ్ అంతిమ యాత్ర

చిత్రేష్ సింగ్‌కు వచ్చే నెల 7న పెద్దలు వివాహం నిశ్చయించారు. 19 రోజుల్లో కుమారుడు పెళ్లి పెట్టుకోవడంతో పెళ్లి కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు అతని తల్లిదండ్రులు. ఇంతలో కన్నబిడ్డ విగతజీవిగా ఇంటికి రావడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

 • Share this:
  ఆయన పేరు చిత్రేష్ సింగ్. వయసు 31 ఏళ్లు. స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్. ఆర్మీలో మేజర్‌గా పనిచేస్తున్నాడు. మరో 19 రోజుల్లో వివాహం. ఇంతలో పుల్వామా ఎటాక్ జరిగింది. భారత ఆర్మీ అలర్ట్ అయ్యింది. అందులో భాగంగానే చిత్రేష్ కూడా అలుపెరుగని సైనికుడిలా పనిచేస్తున్నాడు. ఆదివారం జమ్ముకాశ్మీర్‌లోని Loc వద్ద ఓ ఐఈడీ బాంబ్ ఉందన్న సమాచారం అందింది. హుటాహుటిన అక్కడకు చేరుకున్న చిత్రేష్ బాంబ్‌ను డిఫ్యూజ్ చేసే పనిలో పడ్డాడు. అయితే అక్కడున్న మరో బాంబ్ పేలడంతో తీవ్రగాయాల పాలయ్యాడు. వెంటనే అతడ్ని జవాన్లు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ తీవ్రగాయాలు కావడంతో చిత్రేష్ సింగ్ మృతిచెందాడు.

  చిత్రేష్ సింగ్ పెళ్ళి శుభలేఖ


  చిత్రేష్ సింగ్‌కు వచ్చే నెల 7న పెద్దలు వివాహం నిశ్చయించారు. 19 రోజుల్లో కుమారుడు పెళ్లి పెట్టుకోవడంతో పెళ్లి కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు అతని తల్లిదండ్రులు. ఇంతలో కన్నబిడ్డ విగతజీవిగా ఇంటికి రావడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గుండెలవిసేలా రోదిస్తున్నారు. వాళ్ల ఆవేదన చూడలేక చుట్టుపక్కల వాళ్లు ఆ తల్లిదండ్రులను ఓదార్చలేకపోతున్నారు. వేలాదిమంది అమర్ జవాన్ చిత్రేష్ సింగ్‌ను చూసేందుకు కడసారి చూపుకోసం తరలివచ్చారు. సొంతూరు డెహ్రాడూన్‌లో చిత్రేష్ సింగ్ భౌతిక కాయానికి ఘన నివాళులర్పించారు. ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద సింగ్ రావత్, గవర్నర్ బేబి రాని మౌర్య నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

  First published: