Namrata Sirodkar: డ్రగ్స్ కేసులో తెరపైకి మహేశ్ బాబు భార్య నమ్రత పేరు

నమ్రతా శిరోద్కర్ (ఫైల్ ఫోటో)

Namrata Sirodkar: డ్రగ్స్ కేసు విచారణలో బాలీవుడ్ వెటరన్ హీరోయిన్, టాలీవుడ్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ పేరు తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది.

  • Share this:
    బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తోంది. రియా చక్రవర్తితో పాటు సుశాంత్ మేనేజర్‌గా పని చేసిన జయా సాహాను విచారిస్తున్న ఎన్సీబీ... డ్రగ్స్ కేసులో ఇంకెంతమందికి సంబంధాలు ఉన్నాయనే దానిపై లోతుగా ఆరా తీస్తున్నారు. తాజాగా ఈ కేసు విచారణలో బాలీవుడ్ వెటరన్ హీరోయిన్, టాలీవుడ్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ పేరు తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్సీబీ విచారణలో నమ్రత పేరు బయటకు వచ్చినట్టు సమాచారం. ఎన్సీబీ ట్రాకింగ్‌లో జయా సాహా, నమ్రత చాటింగ్ వెలుగులోకి రావడంతో ఈ కేసులో నమ్రత పేరు బయటకు వచ్చింది. నమ్రతకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు జయా సాహా వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది.

    అయితే ఈ కేసుతో నమ్రతకు ఎలాంటి సంబంధం లేదని నమ్రత టీమ్ తెలిపింది. కొందరు ఈ కేసులో నమ్రత పేరును తప్పుగా ఉపయోగిస్తున్నారని క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ చాటింగ్‌కు జయ సాహా‌తో జరిపిన చాటింగ్‌పై నమ్రత నుంచి స్పందన రావాల్సి ఉంది. ఇక ఈ కేసులో దీపిక పదుకొణె పేరు కూడా వినిపిస్తోంది. దీపిక జయ సాహాతో జరిపిన చాటింగ్‌ బయటకు రావడంతో.. ఈ కేసులో ఇంకెంతమంది హీరోయిన్లు, సెలబ్రిటీలు ఉన్నారనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ కేసులో దియా మీర్జా పాత్ర కూడా ఉందనే అంశానికి సంబంధించి ఆధారాలు లభించడంతో.. త్వరలోనే ఆమెకు ఎన్సీబీ సమన్లు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: